RCB vs LSG, IPL 2024: 35 సిక్స్‌లు.. 46 ఫోర్లు..144 స్ట్రైక్ రేట్‌తో 628 రన్స్.. ఆర్సీబీకి విలన్‌గా లోకల్ బాయ్

|

Apr 02, 2024 | 6:15 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 15వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్‌జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మంగళవారం (ఏప్రిల్‌ 2) జరగనున్నఈ మ్యాచ్ ఇరు జట్లుకు మరీ ముఖ్యంగా ఆర్సీబీకీ చాలా కీలకం. కాగా బెంగళూరు..

RCB vs LSG, IPL 2024: 35 సిక్స్‌లు.. 46 ఫోర్లు..144 స్ట్రైక్ రేట్‌తో 628 రన్స్.. ఆర్సీబీకి విలన్‌గా లోకల్ బాయ్
Royal Challengers Bengaluru vs Lucknow Super Giants
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 15వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్‌జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మంగళవారం (ఏప్రిల్‌ 2) జరగనున్నఈ మ్యాచ్ ఇరు జట్లుకు మరీ ముఖ్యంగా ఆర్సీబీకీ చాలా కీలకం. కాగా బెంగళూరు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ కు సొంత మైదానం. దీంతో ఆర్సీబీతో పాటు అతనికి కూడా చిన్న స్వామి స్టేడియంలో అభిమానుల నుంచి పూర్తి మద్దతు లభించనుంది. ఇదే ఇప్పుడు ఆర్సీబీ జట్టు ఆందోళనకు కారణం. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఏ జట్టుతో ఎలా ఆడతాడో తెలియదు కానీ RCBపై మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అతని గణాంకాలే ఇందుకు నిదర్శనం. కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు ఆర్సీబీపై మొత్తం 14 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 628 పరుగులు చేశాడు. నాలుగు సార్లు నాటౌట్‌గా కూడా నిలిచాడు. అంటే RCBపై KL రాహుల్ 69.77 సగటుతో పరుగులు చేశాడు. RCBపై 144.03 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన KL రాహుల్ 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. మొత్తమ్మీద బెంగళూరుపై 46 ఫోర్లు, 35 సిక్సర్లు బాదాడీ లోకల్ ప్లేయర్.

అంటే ఆర్సీబీపై 14 ఇన్నింగ్స్‌ల్లో సిక్సర్లు, ఫోర్లతోనే మొత్తం 394 పరుగులు చేశాడు కేఎల్ రాహుల్ . ఇప్పుడు మరోసారి సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. అది కూడా తనకు బాగా అచ్చొచ్చిన ఆర్సీబీ జట్టుపై. RCB అభిమానులు కూడా KL రాహుల్ నుండి గొప్ప ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నారు. కేఎల్ రాహుల్ బాగా ఆడాలి. అదే సమయంలో ఆర్సీబీ జట్టు గెలవాలంటూ ఆ జట్టు ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బెంగళూరుపై రాహుల్ రికార్డులిలా..

చిన్నస్వామి స్టేడియంలో ఆడడంపై రాహుల్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..