RCB vs GT Highlights, IPL 2026: ఘన విజయంతో ఫైనల్ చేరిన ఆర్సీబీ.. గుజరాత్‌కు మరో ఛాన్స్

Royal Challengers Bengaluru vs Gujarat Titans IPL 2026 Qualifier 1 Highlights: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గుజరాత్ టైటాన్స్ (GT)కు 255 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ధర్మశాలలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ 93 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును ముందుండి నడిపించాడు.

RCB vs GT Highlights, IPL 2026: ఘన విజయంతో ఫైనల్ చేరిన ఆర్సీబీ.. గుజరాత్‌కు మరో ఛాన్స్
RCB vs GT Live Score

Updated on: May 26, 2026 | 11:52 PM

Royal Challengers Bengaluru vs Gujarat Titans IPL 2026 Qualifier 1 Highlights: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో సీజన్‌లో ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం జరిగిన క్వాలిఫయర్ 1లో ఈ జట్టు గుజరాత్ టైటాన్స్‌ను 92 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పుడు గుజరాత్, ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్ 2లో తలపడుతుంది. బుధవారం న్యూ చండీగఢ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ జరగనుంది.

ధర్మశాలలో టాస్ ఓడిపోయిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. దీనికి ప్రతిగా, గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది.

అంతకుముందు, బెంగళూరు తరఫున కెప్టెన్ రజత్ పాటిదార్ 33 బంతుల్లో 93 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు, ఇందులో 9 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్యా చెరో 43 పరుగులు చేశారు. గుజరాత్ తరఫున కగిసో రబాడా, జాసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇదిలా ఉండగా, ప్లేఆఫ్/నాకౌట్ చరిత్రలో బెంగళూరు అత్యధిక స్కోరును నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు 2023లో క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్‌పై 233/3 స్కోరు చేసిన గుజరాత్ పేరిట ఉండేది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 26 May 2026 11:49 PM (IST)

    ఫైనల్ చేరిన ఆర్సీబీ

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో సీజన్‌లో ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం జరిగిన క్వాలిఫయర్ 1లో ఈ జట్టు గుజరాత్ టైటాన్స్‌ను 92 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పుడు గుజరాత్, ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్ 2లో తలపడుతుంది. బుధవారం న్యూ చండీగఢ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ జరగనుంది.

  • 26 May 2026 11:23 PM (IST)

    16 ఓవర్లకు..

    గుజరాత్ 16 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాహుల్ తెవాటియా, మహ్మద్ సిరాజ్ క్రీజులో ఉన్నారు.

  • 26 May 2026 11:06 PM (IST)

    8 వికెట్లు డౌన్..

    గుజరాత్ 12 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 88 పరుగులు మాత్రమే చేయగలిగింది.

  • 26 May 2026 10:50 PM (IST)

    9 ఓవర్లకు..

    9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టీం 6 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది.

  • 26 May 2026 10:29 PM (IST)

    5 వికెట్లు కోల్పోయిన గుజరాత్

    గుజరాత్ టీం 5 వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ ఛేజింగ్‌లో చేతులెత్తేసింది. ప్రస్తుతం 5.5 ఓవర్లకు 51 పరుగులు చేసినా కీలక వికెట్లు కోల్పోవడంతో పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది.

  • 26 May 2026 10:16 PM (IST)

    పెవిలియన్ చేరిన గిల్

    గుజరాత్ కెప్టెన్ గిల్ కూడా కేవలం 2 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో గుజరాత్ 3 ఓవర్లలోనే 2 కీలక వికెట్లు కోల్పోయింది.

  • 26 May 2026 10:10 PM (IST)

    హిట్ వికెట్‌గా సాయి సుదర్శన్ ఔట్..

    జోరు మీదున్న సాయి సుదర్శన్ (14) ఊహించని రీతిలో హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో గుజరాత్ టీం 17 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది.

  • 26 May 2026 10:02 PM (IST)

    బౌండరీలతో షురూ చేసిన ఆరెంజ్ క్యాప్ హోల్డర్

    255 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్.. తొలి ఓవర్‌లో 11 పరుగులు సాధించింది. సాయి 9, గిల్ 2 పరుగులతో నిలిచారు.

  • 26 May 2026 09:23 PM (IST)

    గుజరాత్ టార్గెట్ 255

    టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీం 5 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. పటీదార్ 93 పరుగులతో అజేయంగా నిలిచాడు.

  • 26 May 2026 09:15 PM (IST)

    230 దాటిన స్కోర్

    19 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 5 వికెట్లు కోల్పోయి 235 పరుగులు సాధించింది. క్రీజులో రజత్ పాటిదార్, జితేష్ శర్మ ఉన్నారు.

  • 26 May 2026 09:03 PM (IST)

    ప్లేఆఫ్స్/నాకౌట్స్‌లో అత్యంత ఖరీదైన ఓవర్‌

    కుల్వంత్ వేసిన 28 పరుగుల ఓవర్, ఐపీఎల్ ప్లేఆఫ్/నాకౌట్ చరిత్రలో రెండవ అత్యంత ఖరీదైన ఓవర్‌గా నిలిచింది. ఇంతకుముందు అత్యంత ఖరీదైన ఓవర్ 2014 క్వాలిఫయర్ 2లో పర్వీందర్ అవానా వేసినది. వాంఖేడేలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తరపున అతను 33 పరుగులు ఇచ్చాడు.

  • 26 May 2026 08:52 PM (IST)

    15 ఓవర్లకు

    15 ఓవర్ల తర్వాత బెంగళూరు 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. రజత్ పాటిదార్, కృనాల్ పాండ్యా క్రీజులో ఉన్నారు.

  • 26 May 2026 08:42 PM (IST)

    14 ఓవర్లకు..

    14 ఓవర్ల తర్వాత బెంగళూరు 3 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. రజత్ పాటిదార్, కృనాల్ పాండ్యా క్రీజులో ఉన్నారు.

  • 26 May 2026 08:29 PM (IST)

    11 ఓవర్లకు

    11 ఓవర్ల తర్వాత బెంగళూరు 3 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. రజత్ పాటిదార్, కృనాల్ పాండ్యా క్రీజులో ఉన్నారు. దేవదత్ పడిక్కల్ 30 పరుగులకు, విరాట్ కోహ్లీ 43 పరుగులకు, వెంకటేష్ అయ్యర్ 19 పరుగులకు అవుటయ్యారు.

  • 26 May 2026 08:18 PM (IST)

    హాఫ్ సెంచరీకి 7 పరుగుల దూరంలో కోహ్లీ ఔట్..

    విరాట్ కోహ్లీ 43 పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే పడిక్కల్ కూడా 30 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో ఆర్సీబీ 8.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది.

  • 26 May 2026 08:03 PM (IST)

    ముగిసిన పవర్ ప్లే

    పవర్ ప్లే ముగిసే సరికి ఆర్‌సీబీ టీం 1 వికెట్ కోల్పోయి 76 పరుగులు చేసింది. కోహ్లీ 34, పడిక్కల్ 23 పరుగులు చేశారు.

  • 26 May 2026 07:57 PM (IST)

    పడిక్కల్, కోహ్లీ ఊచకోత..

    5 ఓవర్ల తర్వాత బెంగళూరు 1 వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ క్రీజులో ఉన్నారు. వెంకటేష్ అయ్యర్ 19 పరుగుల వద్ద అవుటయ్యాడు.

  • 26 May 2026 07:49 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన బెంగళూరు..

    మహమ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్‌లోనే వెంకటేష్ అయ్యర్ 3 ఫోర్లు బాదాడు. ఆ ఓవర్‌లోని తొలి బంతికి బౌండరీ కొట్టిన తర్వాత, అతను మిడ్-వికెట్ మీదుగా రెండో బౌండరీని బాదాడు. నాలుగో బంతికి పర్ఫెక్ట్ టైమింగ్‌తో కొట్టిన బౌండరీతో, వెంకటేష్ కేవలం ఐదు బంతుల్లోనే 13 పరుగులు చేశాడు. ఈలోగా, విరాట్ కోహ్లీ చివరి బంతికి సింగిల్ తీసి తన ఖాతా తెరిచాడు. రెండో ఓవర్‌లో మాత్రం 19 పరుగులు చేసిన అయ్యర్ భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. దీంతో ఆర్‌సీబీ తొలి వికెట్ కోల్పోయింది.

  • 26 May 2026 07:30 PM (IST)

    RCB vs GT Live Score: ఇరు జట్ల రికార్డులు..

    హెడ్-టు-హెడ్ రికార్డులో బెంగళూరు, గుజరాత్ జట్లు సమంగా ఉన్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఎనిమిది ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడగా, వాటిలో బెంగళూరు నాలుగు, గుజరాత్ నాలుగు గెలిచాయి. ఇప్పటివరకు ఏ మ్యాచ్ కూడా టై లేదా డ్రా కాలేదు.

    ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు రెండుసార్లు తలపడగా, ఇరు జట్లు చెరోసారి గెలిచాయి. గత మ్యాచ్‌లో గుజరాత్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందగా, అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

  • 26 May 2026 07:14 PM (IST)

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11

    వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్‌వుడ్, రసిఖ్ సలాం దార్.

  • 26 May 2026 07:14 PM (IST)

    గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ 11

    సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నిషాంత్ సింధు, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కుల్వంత్ ఖేజ్రోలియా, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

  • 26 May 2026 07:05 PM (IST)

    టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్..

    టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్.. బౌలింగ్ ఎంచుకున్నాడు.. ఆర్సీబీ బ్యాటింగ్ కు దిగనుంది.

  • 26 May 2026 06:54 PM (IST)

    భువీ ముప్పు.. ఈ ముగ్గురు జాగ్రత్త!

    అనుభవజ్ఞుడైన బౌలర్ భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ ఆయన బౌలింగ్‌లో జాగ్రత్తగా ఉండాలి.

    * భువీ టీ20ల్లో బట్లర్‌ను 9 సార్లు, గిల్‌ను 5 సార్లు అవుట్ చేశారు.

    * ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్ అయిన భువీ, 14 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీశారు.

    * క్వాలిఫైయర్-1లో గెలవాలంటే అటు బ్యాటింగ్‌లో సాల్ట్ మెరుపులు, ఇటు బౌలింగ్‌లో భువీ స్వింగ్ కీలకం కానున్నాయి!

  • 26 May 2026 06:30 PM (IST)

    RCB vs GT Weather Report: వాతావరణం, పిచ్ నివేదిక..

    ఈ ఏడాది హెచ్‌పిసిఎ మైదానంలో భారీగా పరుగులు నమోదయ్యాయి. ఇక్కడ జరిగిన మూడు మ్యాచ్‌లలోని ఆరు ఇన్నింగ్స్‌లలో ఐదింటిలో 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదయ్యాయి. ఈ మూడు మ్యాచ్‌లలోనూ, టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేసి లక్ష్యాన్ని ఛేదించింది. మంగళవారం ధర్మశాలలో వర్షం పడేందుకు 80% అవకాశం ఉంది. ఒకవేళ క్వాలిఫయర్ 1 వర్షం కారణంగా రద్దయితే, లీగ్ దశ తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన బెంగళూరు జట్టు, ఆడకుండానే ఫైనల్‌కు చేరుకుంటుంది.

  • 26 May 2026 06:19 PM (IST)

    లీగ్ స్టేజ్‌లో ప్రదర్శన ఎలా ఉంది?

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లీగ్ దశలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఆ జట్టు ఆడిన 14 మ్యాచ్‌ల్లో 9 మ్యాచ్‌లలో విజయం సాధించి మొత్తం 18 పాయింట్లు సాధించింది. ఈ క్రమంలో ఆర్‌సీబీ నెట్ రన్ రేట్ 0.783గా నమోదైంది.

    మరోవైపు, గుజరాత్ టైటాన్స్ కూడా 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలను నమోదు చేసినప్పటికీ, నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటం వల్ల లీగ్ స్టేజ్‌ను రెండో స్థానంలో ముగించింది. గుజరాత్ టైటాన్స్ నెట్ రన్ రేట్ 0.695గా ఉంది.

  • 26 May 2026 06:15 PM (IST)

    ఫిల్ సాల్ట్‌కు అవకాశం దక్కుతుందా?

    వేలి గాయం కారణంగా జాకబ్ బెథెల్ ప్లేఆఫ్స్ నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఫిల్ సాల్ట్ ఆర్‌సీబీ జట్టులో చేరారు. తన వేలి గాయానికి చికిత్స తీసుకున్న తర్వాత తిరిగి వచ్చిన సాల్ట్, ప్రత్యేకంగా ప్లేఆఫ్స్‌లో ఆడటానికే వచ్చారు. దీనివల్ల ఆర్‌సీబీ బ్యాటింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది.

  • 26 May 2026 06:13 PM (IST)

    250 పరుగులు కూడా సేఫ్ కాదు

    గుజరాత్ టైటాన్స్‌తో జరగనున్న క్వాలిఫైయర్ 1 నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రజత్ పాటిదార్, ప్రస్తుత క్రికెట్ పోకడలపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. “ఒకప్పుడు 180 పరుగులు చేస్తే గెలుస్తామనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 220 నుంచి 250 పరుగులు చేసినా సరే, ఆ స్కోరును కాపాడుకోగలమన్న ధీమా ఏ జట్టులోనూ లేదు. ప్రతి బంతిని బౌండరీకి పంపడమే లక్ష్యంగా బ్యాటర్లు ఆడుతున్నారు” అని ఆయన పేర్కొన్నారు.

  • 26 May 2026 06:08 PM (IST)

    RCB vs GT Top Players: వీళ్ల పోరుపైనే అందరి చూపు..

    కోహ్లీ వర్సెస్ రబాడా: బౌన్సీగా ఉన్న ధర్మశాల పిచ్‌పై కోహ్లీ, రబాడాల మధ్య పోరు కీలకం కానుంది. పవర్‌ప్లేలో కోహ్లీ రబాడాను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. రబాడా, విరాట్ కోహ్లీని నాలుగు సార్లు ఔట్ చేశాడు.

    సాల్ట్ వర్సెస్ సిరాజ్: గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన ఫిల్ సాల్ట్, బెంగళూరు బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేయనున్నాడు. తనను రెండుసార్లు అవుట్ చేసిన మహమ్మద్ సిరాజ్‌ను అతను ఎదుర్కోనున్నాడు.

    గిల్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్: భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్‌తో శుభ్‌మన్ గిల్‌ను పరీక్షిస్తాడు. అతను గిల్‌ను ఐదుసార్లు అవుట్ చేశాడు.

    రషీద్ వర్సెస్ పటీదార్: రజత్ పటీదార్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో నేర్పరి, కానీ అతను ఈ సీజన్‌లో 19 వికెట్లు తీసిన రషీద్ ఖాన్‌ను ఎదుర్కోనున్నాడు.

Follow Us