IPL 2027 వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ భారీ ప్రక్షాళన.. ఈసారైనా ట్రోఫీ పట్టేనా..?

RR Retention List 2027: తొలి ఐపీఎల్ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్‌కు మరో సీజన్ నిరాశగానే ముగిసింది. ప్లేఆఫ్స్ వరకు వెళ్లి క్వాలిఫయర్-2లో నిష్క్రమించిన రాజస్థాన్ రాయల్స్‌, ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందు ఏ ఆటగాళ్లను వదులుకోనుంది? కోట్లు పారేసినా రాణించని స్టార్ల పరిస్థితేంటి?.

IPL 2027 వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ భారీ ప్రక్షాళన.. ఈసారైనా ట్రోఫీ పట్టేనా..?
Rr Retention List 2027

Updated on: Nov 13, 2026 | 7:57 AM

RR Retention List 2027: 2008లో తొలి IPL టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఆ తర్వాత ట్రోఫీని ముద్దాడలేకపోతోంది. ప్రతి సీజన్‌లో కాగితంపై పటిష్టంగానే కనిపిస్తుంది. యువ రక్తంతో దూసుకుపోతుంది. కానీ కీలక సమయంలో తడబడుతుంది. IPL 2026 సీజన్ కూడా అందుకు మినహాయింపు కాలేదు. సీజన్ ఆరంభంలో వరుసగా నాలుగు విజయాలతో దుమ్మురేపిన సంజూ శాంసన్ లేని కొత్త రాజస్థాన్ రాయల్స్.. ఆ తర్వాత మూమెంట్ కోల్పోయింది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య అతికష్టంగా ప్లేఆఫ్స్‌కు చేరింది. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి సత్తా చాటినా.. క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది.

కెప్టెన్ రియాన్ పరాగ్ నాయకత్వంలో యశస్వి జైస్వాల్, సంచలన యువ స్టార్ వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్‌లో అగ్ని వర్షం కురిపిస్తున్నారు. పేపర్‌పై రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. కానీ మిడిల్ ఆర్డర్ వైఫల్యం, బౌలింగ్‌లో నిలకడలేమి జట్టును వెనక్కి లాగుతున్నాయి. ఈ నేపథ్యంలో IPL 2027 వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ ఖచ్చితంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు.

ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నవారు వీరే: రియాన్ పరాగ్ (C), యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్మయర్, శుభమ్ దూబే, హర్షిత్ రాణా (?), వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (WK), లుహాన్-డ్రే ప్రిటోరియస్, రవీంద్ర జడేజా, డొనోవన్ ఫెరీరా, దసున్ శనక, విజయ్ శంకర్ (?), ఎమన్‌జోత్ సింగ్ చాహల్, సామ్ కర్రాన్, లక్ష్య సింగ్ (?), జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ, నాండ్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, కుల్దీప్ సేన్, ఆడమ్ మిల్నే, క్వెనా మఫాకా, బ్రిజేష్ శర్మ, సుశాంత్ మిశ్రా, విగ్నేశ్ పుత్తూర్, యశ్ రాజ్ పుంజా, యుధ్వీర్ సింగ్.

ఇవి కూడా చదవండి

ఈ జట్టు నుంచి రాజస్థాన్ రాయల్స్ వదులుకోబోయే నాలుగు కీలక పేర్లు ఇవేనని క్రికెట్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

1. షిమ్రాన్ హెట్మయర్ – రూ.11 కోట్లు: రాజస్థాన్ రాయల్స్‌కు అత్యంత భారంగా మారిన పేరు హెట్మయర్. 11 కోట్లు పెట్టి నిలుపుకుంటే.. IPL 2026లో 7 ఇన్నింగ్స్‌లో చేసింది కేవలం 78 పరుగులే. స్ట్రైక్ రేట్ 113.04. ఫినిషర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. ఇంత భారీ మొత్తాన్ని మిడిల్ ఆర్డర్ వైఫల్యానికి ఖర్చు చేయడం కంటే.. ఆ డబ్బుతో వేలంలో యువ, ఫామ్‌లో ఉన్న ఫినిషర్‌ను తీసుకోవడం రాజస్థాన్ రాయల్స్‌కు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి హెట్మయర్‌కు ఉద్వాసన దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

2. రవి బిష్ణోయ్ – రూ.7.2 కోట్లు: 9 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసినా.. బిష్ణోయ్ తన ప్రభావం చూపలేకపోయాడు. ఎకానమీ ఎక్కువగా ఉండటంతో సీజన్ మధ్యలోనే యశ్ రాజ్ పుంజా అతని స్థానాన్ని కొట్టేశాడు. పుంజా 8 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి, బిష్ణోయ్ కంటే మెరుగైన ఎకానమీతో ఆకట్టుకున్నాడు. చౌకలో దొరికిన యువ లెగ్ స్పిన్నర్ అందుబాటులో ఉండగా.. 7.2 కోట్ల భారీ మొత్తాన్ని బిష్ణోయ్‌పై ఖర్చు చేయడానికి రాజస్థాన్ రాయల్స్‌ సిద్ధంగా లేదు. వేలం పర్స్ పెంచుకోవడానికి బిష్ణోయ్‌ను వదలడం వ్యూహాత్మక నిర్ణయం అవుతుంది.

3. సామ్ కర్రాన్ – రూ.2.4 కోట్లు: 2022 టీ20 వరల్డ్‌కప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ సామ్ కర్రాన్ వ్యవహారం రాజస్థాన్ రాయల్స్‌లో వివాదాస్పదమైంది. అతని మధ్యలో వైదొలగడంపై హెడ్ కోచ్ కుమార సంగక్కర బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. మేనేజ్‌మెంట్‌కు, ఆటగాడికి మధ్య విభేదాలు బయటకొచ్చిన తర్వాత కర్రాన్‌ను కొనసాగించే అవకాశాలు తక్కువే. ఆల్‌రౌండర్ కోటాలో మరో నమ్మకమైన విదేశీ ఆటగాడి వైపు రాజస్థాన్ రాయల్స్‌ చూసే అవకాశం ఉంది.

4. క్వెనా మఫాకా – రూ.1.5 కోట్లు: దక్షిణాఫ్రికా యువ పేసర్ మఫాకా ఎంతో ప్రతిభావంతుడే. కానీ గాయాలు అతన్ని వెంటాడుతున్నాయి. SA20లో 8 మ్యాచ్‌ల్లో 4 వికెట్లే తీసి.. ఓవర్‌కు 10.68 చొప్పున ధారాదత్తం చేశాడు. ఫిట్‌నెస్‌పై భరోసా లేని ఆటగాడిపై 1.5 కోట్లు పెట్టుబడి పెట్టడం RRకు భారం కావచ్చు. అందుకే యువ విదేశీ పేసర్ కోసం ఫ్రెష్‌గా వేలంలోకి వెళ్లాలని రాజస్థాన్ రాయల్స్‌ భావిస్తోంది.

నిలుపుకోబోయే ఆటగాళ్లు ఎవరు?

విడుదల జాబితా తర్వాత రాజస్థాన్ రాయల్స్‌కు కోర్ గ్రూప్ చాలా స్పష్టంగా ఉంది. కెప్టెన్ రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్ జట్టుకు వెన్నెముకగా ఉంటారు.

RR Probable Retention List: రియాన్ పరాగ్ (C), యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, హర్షిత్ రాణా (?), వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (WK), లుహాన్-డ్రే ప్రిటోరియస్, రవీంద్ర జడేజా, డొనోవన్ ఫెరీరా, దసున్ శనక, ఎమన్‌జోత్ సింగ్ చాహల్, లక్ష్య సింగ్ (?), జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, నాండ్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, కుల్దీప్ సేన్, ఆడమ్ మిల్నే, బ్రిజేష్ శర్మ, సుశాంత్ మిశ్రా, విగ్నేశ్ పుత్తూర్, యశ్ రాజ్ పుంజా, యుధ్వీర్ సింగ్.

మొత్తంగా చూస్తే.. హెట్మయర్, బిష్ణోయ్‌లను వదిలితే రాజస్థాన్ రాయల్స్‌కు పర్స్‌లో దాదాపు 18 కోట్లకు పైగా మిగులుతుంది. ఈ డబ్బుతో ఒక నాణ్యమైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్, ఒక అనుభవజ్ఞుడైన భారత స్పిన్నర్‌ను తీసుకుంటే.. 2008 తర్వాత మళ్లీ ట్రోఫీ కల నెరవేరే అవకాశం ఉంది. మరి రాజస్థాన్ రాయల్స్‌కు థింక్ ట్యాంక్ ఈ దిశగా అడుగులు వేస్తుందో లేదో IPL 2027 వేలం వరకు వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us