రాహుల్ ద్రావిడ్.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో చిరస్మరణీయమైన పేరు. ఓ ఆటగాడిగా, ఓ కెప్టెన్‌గా, ఆ తర్వాత టీమిండియాకు హెడ్ కోచ్‌గా.. ఆయన సేవలు భారత క్రికెట్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. భారత్‌కు 2024లో టీమిండియా వరల్డ్ కప్ అందించిన తర్వాత ద్రావిడ్ తన హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు కోచ్‌గా వెళ్లారు. అయితే తాజాగా ఆయన చేసిన ఓ సాహసోపేతమైన పని మరోసారి క్రికెట్ అభిమానుల మనసును దోచుకునేలా చేసింది. దాంతో క్రికెట్‌పై ఆయన ప్రేమ, నిబద్ధత, అంకితభావాన్ని మరోసారి నిరూపించుకున్నారు.
ఆయన కాలికి పెద్ద గాయమైన కూడా ఏ మాత్రం లెక్కచేయకుండా.. మైదానంలోకి దిగి రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చారు. ఇటీవలె క్రికెట్ ఆడుతుంటే ద్రావిడ్ కాలికి పెద్ద గాయమైంది. ఎడమ కాలికి దెబ్బ తాకింది. దీంతో ఆ కాలికి పెద్ద కట్టు కట్టారు. అయితే ఐపీఎల్ 2025 సీజన్ దగ్గర పడుతోన్న తరుణంలో ఆయనే దగ్గరుండి జట్టుతో ప్రాక్టీస్ చేయించేందుకు రంగంలోకి దిగారు. తన గాయం వల్ల జట్టుకు ఎలాంటి నష్టం జరగకూడదనే ఉద్దేశ్యంతో ట్రైనింగ్ క్యాంపులో చేరారు.
సరిగా నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ.. ఊతకర్రల సాయంతో రాహుల్ జైపూర్‌లోని ట్రైనింగ్ క్యాంప్‌నకు వచ్చారు. తాను ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆటగాళ్లకు శిక్షణ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇలాంటి కోచ్‌ను ఇంకెక్కడా చూడలేం. రాహుల్ కు గాయమవ్వడం బాధాకరమైన విషయం’ అని రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు.. ఇలాంటి కోచ్ ఉంటే జట్టుకు విజయం పక్కా, ఇలాంటి కోచ్ దొరకడం అదృష్టం అంటూ ద్రవిడ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
💗➡️🏡 pic.twitter.com/kdmckJn4bz
— Rajasthan Royals (@rajasthanroyals) March 13, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..