PBKS vs MI, IPL 2024: బూమ్ బూమ్ బుమ్రా.. పంజాబ్ పై ముంబై విజయం.. హార్దిక్ సేన ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

Punjab Kings vs Mumbai Indians: పంజాబ్‌ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ 9 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (78), రోహిత్‌ శర్మ (36), తిలక్‌ వర్మ(34) రాణించారు.

PBKS vs MI, IPL 2024: బూమ్ బూమ్ బుమ్రా.. పంజాబ్ పై ముంబై  విజయం.. హార్దిక్ సేన ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
Mumbai Indians
Follow us

|

Updated on: Apr 19, 2024 | 12:04 AM

Punjab Kings vs Mumbai Indians: పంజాబ్‌ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ 9 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (78), రోహిత్‌ శర్మ (36), తిలక్‌ వర్మ(34) రాణించారు. పంజాబ్‌ బౌలర్లలో హర్షల్ పటేల్‌ 3, సామ్‌ కరన్ 2 వికెట్లు తీశారు. అనంతరం ఛేదనకు దిగిన పంజాబ్‌ 19.1 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌట్‌ అయింది. అశుతోష్‌ శర్మ (61), శశాంక్‌ సింగ్‌ (41) మినహా మిగతా బ్యాటర్లు నిరాశపర్చడంతో పంజాబ్ కు మరో పరాభవం తప్పలేదు. ముంబయి బౌలర్లో జస్ ప్రీత్ బుమ్రా, కోయిట్జి తలా 3 వికెట్లు తీయగా, మధ్వాల్‌, గోపాల్‌ తలో వికెట్‌ తీశారు.  కాగా ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్‌కు ఇది మూడో విజయం. మరోవైపు పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్‌ల్లో 5 ఓడిపోయింది.

ఇవి కూడా చదవండి

లక్ష్య ఛసదనల పంజాబ్ కింగ్స్ కేవలం 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది మరియు ముంబై భారీ విజయం సాధిస్తుందేమోననుకున్నారు. అయితే శశాంక్ సింగ్  అశుతోష్ శర్మ మరోసారి తమ అద్భుతమైన బ్యాటింగ్ చేశారు.  శశాంక్ సింగ్ కేవలం 25 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 41 పరుగులు చేశాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అశుతోష్ సిర్ఫ్ 28 బంతుల్లో 61 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. అశుతోష్ తన ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు కొట్టాడు . అతని స్ట్రైక్ రేట్ 217 కంటే ఎక్కువగా ఉంది. అయితే 18వ ఓవర్లో అశుతోష్ ఔట్ కావడంతో చివరికి పంజాబ్ జట్టు 9 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ముంబయి విజయ దరహాసం..

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ, జెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

ఆకాష్ మధ్వల్, నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, నమన్ ధీర్

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రిలే రోసో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కుర్రాన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

రాహుల్ చాహర్, విధ్వత్ కావరప్ప, హర్‌ప్రీత్ భాటియా, శివమ్ సింగ్, రిషి ధావన్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి