Prithvi Shaw: అలా జరగలేదు.. పృథ్వీ షాతో పెళ్లి క్యాన్సిల్‌పై మౌనం వీడిన ఆకృతి.. ఏమందంటే?

Prithvi Shaw Fiancee Akriti Agarwal Breaks Silence on Breakup Rumours: సెలబ్రిటీల వ్యక్తిగత పోస్టులను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలు ఒక్కోసారి వారి జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఏదేమైనా ఆకృతి అగర్వాల్ సకాలంలో స్పందించి పుకార్లకు చెక్ పెట్టడంతో పృథ్వీ షా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Prithvi Shaw: అలా జరగలేదు.. పృథ్వీ షాతో పెళ్లి క్యాన్సిల్‌పై మౌనం వీడిన ఆకృతి.. ఏమందంటే?
Prithvi Shaw And Akriti Agarawal Part Ways

Updated on: Jul 07, 2026 | 7:35 AM

Prithvi Shaw Fiancee Akriti Agarwal Breaks Silence on Breakup Rumours: భారత యువ క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మోసం, బ్రేకప్ అంటూ గత రెండు రోజులుగా వైరల్ అవుతున్న వార్తలపై అతని కాబోయే భార్య, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆకృతి అగర్వాల్ ఎట్టకేలకు స్పందించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేస్తూ నెటిజన్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఆకృతి పెట్టిన ఆ ఒక్క పోస్ట్.. నెట్టింట పెను సంచలనం..!

కొద్దిరోజుల క్రితమే పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్ ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. అయితే, తాజాగా ఆకృతి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “జీవితంలో చాలాసార్లు మోసపోయాను” అంటూ పెట్టిన ఒక రహస్య పోస్ట్ నెట్టింట తీవ్ర దుమారం రేపింది. ఆ పోస్ట్‌లో ఆమె ఎవరి పేరు ప్రస్తావించనప్పటికీ, పృథ్వీ షానే ఆమెను మోసం చేశాడని, అందుకే వారి పెళ్లి క్యాన్సిల్ అయిందంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి తోడు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పృథ్వీ షాను అన్‌ఫాలో చేసి, మళ్లీ ఫాలో అవ్వడం ఈ అనుమానాలకు మరింత బలమిచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Team India: అయ్యర్‌కు డేంజర్ బెల్.. 3 ఛాన్స్‌ల్లో ఒకటి ఫెయిల్.. కొత్త కెప్టెన్ రెడీ చేసిన బీసీసీఐ..?

తప్పుడు ప్రచారాలపై అగ్గిమీద గుగ్గిలమైన కాబోయే భార్య..

ఈ పుకార్లు కాస్తా హద్దులు దాటి పృథ్వీ షా గౌరవానికి భంగం కలిగించేలా మారడంతో ఆకృతి అగర్వాల్ తీవ్రంగా స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా నెటిజన్లకు, మీడియాకు గట్టి వివరణ ఇచ్చారు. “నేను నా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఎక్కడా నా కాబోయే భర్త పేరు చెప్పలేదు. మా నిశ్చితార్థం రద్దయిందని గానీ, మేము విడిపోయామని గానీ నేను అనలేదు. కేవలం ఊహాగానాలతో ఆ పోస్ట్‌ను పృథ్వీ షాకు ముడిపెట్టడం చాలా బాధాకరం. మేము ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. మా బంధం బాగుంది” అంటూ క్లారిటీ ఇచ్చారు.

సెలబ్రిటీల జీవితాలతో ఆటలాడకండి..!

పబ్లిక్ లైఫ్‌లో ఉన్న వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడం ఎంత సులువో ఈ ఘటనతో అర్థమైందని ఆకృతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు, సందర్భం లేకపోయినా కేవలం ఒక పోస్ట్‌ను బట్టి నిజానిజాలు తెలుసుకోకుండా నిందించడం సరికాదన్నారు. పృథ్వీ షా గౌరవానికి భంగం కలుగుతుండటం చూస్తూ ఊరుకోలేకే తాను ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. దీంతో గత రెండు రోజులుగా నడుస్తున్న హైడ్రామాకు తెరపడినట్లయింది.

ఇది కూడా చదవండి: IND vs ENG: అగ్నిపరీక్షకు సిద్ధమైన కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. 3వ టీ20లో ఆ స్టార్ ప్లేయర్‌పై వేటు?

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా పృథ్వీ షా కెరీర్..

భారత జట్టులో అద్భుతమైన ఓపెనర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ షా కెరీర్ ఎప్పుడూ వివాదాలతోనే సాగుతోంది. మైదానంలో ఎంత మెరుపులు మెరిపించినా, మైదానం వెలుపల సెలబ్రిటీలతో గొడవలు, ఫిట్‌నెస్ సమస్యలు, నిషేధిత డ్రగ్స్ వివాదం వంటివి అతని కెరీర్‌ను దెబ్బతీశాయి. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నప్పటికీ అతనికి తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో వ్యక్తిగత జీవితంపై కూడా తప్పుడు ప్రచారం జరగడం అతన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us