World Cup 2023: మరోసారి మారనున్న ప్రపంచకప్ షెడ్యూల్.. పాకిస్తాన్‌ మ్యాచ్‌కు పొంచి ఉన్న ముప్పు?

Updated on: Sep 10, 2023 | 4:17 PM

Pakistan Cricket Team: ప్రపంచ కప్ 2023కి ముందు, మరోసారి మ్యాచ్ నిర్వహణకు సంబంధించి పెద్ద సమస్య తలెత్తుతున్నట్లు కనిపిస్తోంది. నివేదికల ప్రకారం, పాకిస్తాన్ ప్రాక్టీస్ మ్యాచ్‌ను మార్చాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మరి బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి. ఇప్పటికే ఓసారి ప్రపంచకప్ షెడ్యూల్‌ను మార్చిన ఐసీసీ, బీసీసీఐ.. తాజా డిమాండ్‌పై ఎలా స్పందిస్తాయో చూడాలి.

1 / 5
ప్రపంచ కప్ 2023 ప్రారంభం కావడానికి ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది. దానికి ముందు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కీలక డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది BCCIని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. మీడియా కథనాల ప్రకారం, పాకిస్థాన్ ప్రాక్టీస్ మ్యాచ్ తేదీని మార్చాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

2 / 5
ప్రపంచకప్‌నకు ముందు సెప్టెంబర్ 29న హైదరాబాద్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు తగిన భద్రత కల్పించడంలో భద్రతా సంస్థలు అసమర్థతను వ్యక్తం చేశాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.

3 / 5
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకారం, గణేష్ నిమజ్జనం, మిలన్-ఉన్-నబీ సందర్భంగా పోలీసులు భారీగా భద్రత కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్-న్యూజిలాండ్ మ్యాచ్ షెడ్యూల్‌ను మార్చాలని డిమాండ్ తెరపైకి వస్తోంది.

4 / 5
ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌లో ఇప్పటికే పెద్ద మార్పు జరిగిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 9న, BCCI కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో భారత్-పాకిస్తాన్‌తో సహా మొత్తం 9 మ్యాచ్‌లలో మార్పులు చేశారు.

5 / 5
ఇంతకుముందు, ప్రపంచ కప్ 2023లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగాల్సి ఉంది. ఆ తర్వాత మ్యాచ్ ఒకరోజు ముందుగానే అక్టోబర్ 14కి మార్చారు.