పాకిస్తాన్‌ క్రికెట్‌లో ఫిక్సింగ్ కలకలం.. 2 ఏళ్లపాటు నిషేధం విధించిన పీసీబీ.. ఎవరంటే?

|

Feb 07, 2023 | 7:34 PM

Match Fixing In Pakistan Cricket: మ్యాచ్ ఫిక్సింగ్‌లో పాక్ ఆటగాళ్లు చిక్కుకోవడం కొత్త విషయమేమీ కాదు. పాకిస్థాన్ చరిత్ర కళంకిత ఆటగాళ్లతో నిండి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

1 / 5
మ్యాచ్ ఫిక్సింగ్‌లో పాక్ ఆటగాళ్లు చిక్కుకోవడం కొత్త విషయమేమీ కాదు. పాకిస్థాన్ చరిత్ర కళంకిత ఆటగాళ్లతో నిండి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మరో పాకిస్థాన్ సీనియర్ ఆటగాడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి రెండేళ్ల నిషేధానికి గురయ్యాడు.

2 / 5
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన ఆసిఫ్ అఫ్రిది ఈ బౌలర్‌పై పీసీబీ రెండేళ్లపాటు నిషేధం విధించింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఈ ఆటగాడు ఇప్పుడు సెప్టెంబర్ 12, 2024 వరకు క్రికెట్‌కు దూరమయ్యాడు.

3 / 5
పీసీబీ ఆసిఫ్ ఆఫ్రిదిని వచ్చే రెండేళ్ల పాటు దేశవాళీ క్రికెట్, పీఎస్ఎల్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించింది. ఆసిఫ్ అఫ్రిది కాశ్మీర్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్నాడు. అక్కడ రావల్‌కోట్ హాక్స్ జట్టు తరపున ఆడుతున్నప్పుడు, ఈ ఆటగాడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు.

4 / 5
పాకిస్థాన్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లలో ఆసిఫ్ అఫ్రిది ఒకరు. ఈ ఆటగాడు 35 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 118 వికెట్లు తీశాడు. లిస్ట్ ఏలో 59 వికెట్లు తీశాడు. టీ20ల్లో అఫ్రిది 63 వికెట్లు తీశాడు. బాబర్ ఆజం వికెట్ కూడా ఆసిఫ్ అఫ్రిది పడగొట్టాడు.

5 / 5
పీఎస్‌ఎల్‌లో ముల్తాన్ సుల్తాన్స్ తరపున ఆసిఫ్ అఫ్రిది ఆడాడు. దేశవాళీ క్రికెట్‌లో, ఆసిఫ్ ఖైబర్ పఖ్తున్ఖ్వా తరపున ఆడాడు.