
Babar Azam Trolled: గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం భారీ స్కోరు సాధించడంలో విఫలం కావడంతో నెటిజన్లు ఈ పాక్ దిగ్గజాన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కోవడానికి బాబర్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో అవుట్ కావడానికి ముందు ఆయన 20 బంతుల్లో కేవలం 24 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మ్యాచ్ 14వ ఓవర్‌లో, జంపా వేసిన గూగ్లీని రివర్స్ స్వీప్ చేయడానికి ప్రయత్నించి బాబర్ పూర్తిగా విఫలమయ్యాడు. బంతి నేరుగా వచ్చి స్టంప్స్‌ను తాకింది. దాంతో బాబర్ ఒత్తిడితో కూడిన ఇన్నింగ్స్ ముగిసింది.
బిగ్ బాష్ లీగ్ (BBL) లో ఇప్పటికే పేలవమైన ప్రదర్శన చేసిన బాబర్, ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ విఫలం కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో ఆయనను చేర్చడంపై కొందరు నిపుణులు, పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు ఇప్పటికే అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Why did Babar Azam play this shot? This is not his game. I cannot believe it 😢💔 #PAKvAUS #tapmad pic.twitter.com/cgwlt1DpI3
— Sports Punch (@arif_mahwish) January 29, 2026
సోషల్ మీడియాలో అభిమానులు బాబర్ ఆటతీరుపై మండిపడుతున్నారు. మరో ‘ఫ్లాప్ షో’ ఇచ్చినందుకు ఆయనపై భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. అయితే, ఆస్ట్రేలియా రన్ ఛేజింగ్‌లో బాబర్ మూడు క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 22 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఈ ఏడాది బిగ్ బాష్ లీగ్‌లో బాబర్ ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. 11 మ్యాచ్‌లలో కేవలం రెండు అర్ధసెంచరీల సహాయంతో 202 పరుగులు మాత్రమే చేశాడు. ఆయన స్ట్రైక్ రేట్ కేవలం 103 కాగా, సగటు 22 మాత్రమే ఉంది.
Babar Azam will bounce back
— ZaHid Say’s (@Iamzahiddd_56) January 29, 2026
లీగ్‌లో బాబర్ ఆడుతున్న సమయంలో ఒక వివాదం కూడా తలెత్తింది. స్టీవ్ స్మిత్ ఒక సందర్భంలో బాబర్‌కు సింగిల్ ఇవ్వడానికి నిరాకరించాడు (అప్పుడు బాబర్ 58 బంతుల్లో 47 పరుగుల వద్ద ఉన్నాడు). ఆ తర్వాత స్మిత్ 238 స్ట్రైక్ రేట్‌తో సెంచరీ పూర్తి చేయడం గమనార్హం.
బాబర్ తో పాటు మొహమ్మద్ రిజ్వాన్ కూడా బిగ్ బాష్‌లో విఫలమయ్యాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 188 పరుగులు మాత్రమే చేశాడు. ఒక మ్యాచ్‌లో అయితే మరీ నెమ్మదిగా ఆడుతున్నాడని మెల్బోర్న్ రెనెగేడ్స్ యాజమాన్యం రిజ్వాన్‌ను బ్యాటింగ్ నుంచి వెనక్కి (రిటైర్డ్ అవుట్) పిలిపించింది. గాయం కారణంగా మధ్యలోనే వచ్చేసిన షాహీన్ అఫ్రిది కూడా బీబీఎల్‌లో యావరేజ్ ప్రదర్శనకే పరిమితమయ్యాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..