Watch Video: పాక్-ఆప్ఘన్ మ్యాచ్‌లో రచ్చ.. జస్ట్ మిస్.. వారు రాకపోతే పెద్ద ఫైటింగే జరిగేది..!

Watch Video: బుధవారం షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను ఒక వికెట్ తేడాతో ఓడించిన పాకిస్థాన్ ఆసియా కప్ ఫైనల్‌కు..

Watch Video: పాక్-ఆప్ఘన్ మ్యాచ్‌లో రచ్చ.. జస్ట్ మిస్.. వారు రాకపోతే పెద్ద ఫైటింగే జరిగేది..!
Asif Ali

Updated on: Sep 08, 2022 | 11:37 AM

Watch Video: బుధవారం షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను ఒక వికెట్ తేడాతో ఓడించిన పాకిస్థాన్ ఆసియా కప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరం కాగా, మధ్యలో టెయిల్ ఎండర్లు నసీమ్ షా, మహ్మద్ హస్నైన్ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ పాకిస్తాన్‌ను ఓడిస్తుందనే ఆశలు ఉన్న వేళ.. నసీమ్ వాటిని అడియాశలు చేశాడు. ఫజల్‌హక్ ఫరూఖీ వేసిన మొదటి రెండు బంతుల్లో పేసర్ రెండు సిక్సర్లు కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.

అయితే, ఆ రెండు బంతులకు ముందు.. 19వ ఓవర్ ఐదో బంతికి, ఆసిఫ్ అలీ వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. దానికంటే ముందు బంతి అంటే 19వ ఓవర్ నాలుగో బంతికి అసిఫ్‌ సిక్స్ కొట్టాడు. దాన్ని దృష్టిలో ఉంచుకున్న ఫరీద్.. అసిఫ్ ఔట్ అవగానే అతనివైపు వెళ్లి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అయితే, ఫరీద్ చర్యలకు ఆగ్రహానికి లోనైన ఆసిఫ్.. బ్యాట్ పైకి ఎత్తి కొట్టబోయాడు. అప్పటికీ వెనక్కి తగ్గని ఫరీద్.. ఆసిఫ్ భుజాన్ని తట్టి, దూషిస్తూ మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇంతలో ఆఫ్ఘన్ టీమ్ మెంబర్స్ కల్పించుకుని వారిద్దరినీ విడదీశారు. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. ఆసియా కప్ ట్రోఫీలో పాకిస్తాన్ విజయంతో ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌ పోరులో శ్రీలంకతో తలపడనుంది. ఇక భారత్, ఆప్ఘనిస్తాన్‌లు రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందకపోవడంతో ఫైనల్‌ బెర్త్‌ను కోల్పోయాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us