క్రికెట్‌లో ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కొన్నిసార్లు విజయానికి చేరువైన జట్లు ఓటమి చవి చూస్తే.. మరికొన్ని సందర్భాల్లో ఓటమి అంచుకు వెళ్లిన జట్లు అద్భుత విజయాలు అందుకుంటాయి. SA20 లీగ్‌లో సరిగ్గా ఇదే సీన్ రిపీట్ అయింది. కానీ ఒకే తేడా ఏమిటంటే.. గెలిచిన జట్టుకు ఎంత సంతోషం కలిగిందో.. ఓడిన జట్టు శిబిరంలోనూ అదే ఆనందం కనిపించింది. అవునండీ..! మీరు విన్నది నిజమే.. ఫిబ్రవరి 7న ప్రిటోరియా క్యాపిటల్స్, పార్ల్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పార్ల్ రాయల్స్ 59 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయినప్పటికీ, ఆ జట్టు శిబిరంలో ఆనందం వెల్లువిరిసింది.
ఇది ఎలా సాధ్యమని అనుకుంటున్నారా.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 226 పరుగులు చేసింది. ప్రిటోరియా జట్టు బ్యాట్స్‌మెన్ కుశాల్ మెండిస్ కేవలం 41 బంతుల్లోనే అత్యధికంగా 80 పరుగులు చేశాడు. అటు ఇన్‌గ్రామ్ చివర్లో 41 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లకు భారీ స్కోర్ సాధించింది. ఇక లక్ష్యఛేదనలో భాగంగా బరిలోకి దిగిన పార్ల్ రాయల్స్ 20 ఓవర్లకు కేవలం 167 మాత్రమే చేయగలిగింది. జోస్ బట్లర్ 70 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో ఈ మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ 59 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈ ఓటమి పార్ల్ రాయల్స్‌కు విజయం లాంటిది. సెమీఫైనల్స్‌లో బెర్త్ ఖరారు చేసుకోవడానికి మొదటిదిగా ప్రిటోరియా 227 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయాల్సి ఉండగా.. రెండవది కనీసం 163 పరుగులు సాధించాలి. పార్ల్ రాయల్స్ జట్టు మొదటిది అందుకోవడంలో విఫలం అయినా.. రెండో దాన్ని ఈజీగా సాధించింది. తద్వారా ఓటమి నుంచి కూడా సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోగలిగింది.
PAARL ROYALS QUALIFY FOR THE SEMI-FINAL ? pic.twitter.com/X2EAqTLngL
— JioCinema (@JioCinema) February 7, 2023
MISSION ACCOMPLISHED‼️
Paarl Royals have reached 163 and qualified for the #Betway #SA20 semi-finals! #PCvPR @Betway_India pic.twitter.com/0XGIuJvw2H
— Betway SA20 (@SA20_League) February 7, 2023