IND vs NZ 2nd ODI Result: రాహుల్ సెంచరీ వృథా.. రెండో వన్డేలో కివీస్‌దే విక్టరీ..

రాజ్ కోట్ లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు కేవలం 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది.

IND vs NZ 2nd ODI Result: రాహుల్ సెంచరీ వృథా.. రెండో వన్డేలో కివీస్‌దే విక్టరీ..
Ind Vs Nz 2nd Odi Result

Updated on: Jan 14, 2026 | 9:26 PM

రాజ్ కోట్ లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు కేవలం 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో ప్రస్తుతం ఇరు జట్లు సమానంగా నిలిచాయి. ఫలితం కోసం మూడో వన్డే కోసం ఆడాల్సిందే.

న్యూజిలాండ్ తరపున డారిల్ మిచెల్ సెంచరీ ఇన్నింగ్ తో ఆకట్టుకున్నాడు. డారిల్ మిచెల్ 96 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 87 పరుగుల వద్ద విల్ యంగ్ అవుట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో నితీష్ కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆరో ఓవర్లో హర్షిత్ రాణా డెవాన్ కాన్వేను అవుట్ చేయగా, 13వ ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ హెన్రీ నికోల్స్‌ను అవుట్ చేశాడు.

కెఎల్ రాహుల్ సెంచరీ, శుభ్‌మన్ గిల్ అర్ధ సెంచరీ..

భారత ఆటగాడు కేఎల్ రాహుల్ 92 బంతుల్లో అజేయంగా 112 పరుగులు చేసి తన ఎనిమిదో వన్డే సెంచరీని నమోదు చేసుకున్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 56, రోహిత్ శర్మ 24, విరాట్ కోహ్లీ 23 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా 27 పరుగులతో కీలక పాత్ర పోషించాడు.

న్యూజిలాండ్ తరపున క్రిస్టియన్ క్లార్క్ మూడు వికెట్లు పడగొట్టగా, అరంగేట్ర ఆటగాళ్లు జాడెన్ లెన్నాక్స్, జాక్ ఫాల్క్స్, కైల్ జామిసన్, కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

ఏకైక బ్యాట్స్‌మన్ గా కేఎల్ రాహుల్..

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5వ స్థానంలో సెంచరీ చేసిన తర్వాత, కేఎల్ రాహుల్ ఒక ముఖ్యమైన రికార్డును సృష్టించాడు. ప్రపంచంలో 1వ స్థానం నుంచి 6వ స్థానం వరకు ప్రతి బ్యాటింగ్ స్థానంలో సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్ అతనే.

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: శుభమన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

న్యూజిలాండ్: మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచ్ హే (వికెట్ కీపర్), జాక్ ఫాల్క్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..