Smriti Mandhana : గుండెపోటు కాదు..అసలు ట్విస్ట్ ఇదేనా? పెళ్లికి ముందే పలాష్ స్కాండల్ గురించి పాత పోస్ట్ లీక్

భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ పెళ్లి ఆగిపోవడం ఇప్పటికే ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారితీసింది. మంధాన తండ్రికి గుండెపోటు రావడంతో పెళ్లి వాయిదా పడింది. అయితే ఈ గందరగోళం మధ్య ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

Smriti Mandhana : గుండెపోటు కాదు..అసలు ట్విస్ట్ ఇదేనా? పెళ్లికి ముందే పలాష్ స్కాండల్ గురించి పాత పోస్ట్ లీక్
Smriti Mandhana (2)

Updated on: Nov 26, 2025 | 10:50 AM

Smriti Mandhana : భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ పెళ్లి ఆగిపోవడం ఇప్పటికే ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారితీసింది. మంధాన తండ్రికి గుండెపోటు రావడంతో పెళ్లి వాయిదా పడింది. అయితే ఈ గందరగోళం మధ్య ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వివాహ వేడుకలు మొదలవడానికి కొన్ని రోజుల ముందు, అంటే నవంబర్ 11న ఒక సోషల్ మీడియా యూజర్ పలాష్‌పై ఒక వివాదం త్వరలో బయటకు వస్తుందని పోస్ట్ చేశాడు. ఈ పాత పోస్ట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతూ ఈ మొత్తం కథనానికి కొత్త మలుపు ఇచ్చింది.

నవంబర్ 11న ఆ యూజర్ పెట్టిన పోస్ట్‌లో.. “పలాష్ ముచ్చల్‌కి సంబంధించిన ఒక ప్రేమ వివాదం త్వరలో బయటకు రావచ్చని, అయితే దానికి సంబంధించిన సాక్ష్యాలు మాత్రం లేవని” పేర్కొన్నాడు. పలాష్ అక్రమ సంబంధాలు, లీకైన చాట్‌ల గురించిన ఊహాగానాలు వచ్చిన తర్వాత ఈ పాత పోస్ట్ మళ్లీ తెరపైకి వచ్చింది. స్మృతి మంధాన కూడా తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి పెళ్లికి సంబంధించిన పోస్టులను డిలీట్ చేయడం, మరోవైపు ఈ పాత పోస్ట్ కనిపించడం… ఇవన్నీ కలిపి నెటిజన్లలో అనుమానాలను మరింత పెంచాయి. ఈ పోస్ట్ పెట్టిన వ్యక్తికి ముందే ఏదైనా సమాచారం తెలిసిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

స్మృతికి దగ్గరగా ఉన్నవారి సోషల్ మీడియా కార్యకలాపాలు కూడా ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. స్మృతి అత్యంత సన్నిహితురాలు, మహారాష్ట్ర క్రికెటర్ అయిన శివాలీ షిండే, నిన్న పలాష్ ముచ్చల్‌ను అన్‌ఫాలో చేశారు. శివాలీ పెళ్లి ముందు జరిగిన అన్ని వేడుకలకు హాజరయ్యారు. అందుకే ఆమె అన్‌ఫాలో చేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. స్మృతి టీమ్‌మేట్ అయిన శ్రేయాంక పాటిల్ కూడా పెళ్లి వేడుకలకు సంబంధించిన ఒక హైలైట్ రీల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించారు. ఈ చర్యలు స్మృతికి దగ్గరగా ఉన్నవారికి ఈ సమస్యల గురించి ముందే తెలుసేమో అనే అనుమానాలను బలపరుస్తున్నాయి.

ఆన్‌లైన్‌లో ఇంత జరుగుతున్నప్పటికీ కుటుంబాలు మాత్రం తమ వైఖరిని మార్చుకోలేదు. స్మృతి తండ్రికి అకస్మాత్తుగా గుండెపోటు రావడం వల్లనే వివాహం వాయిదా పడిందని, అందుకే అంతా ఆరోగ్యంపై దృష్టి పెట్టారని స్పష్టం చేశారు. నిరాధారమైన పుకార్లను నమ్మవద్దని, తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని వారు అభిమానులను కోరారు. ముఖ్యంగా పలాష్ ముచ్చల్ తన ఎంగేజ్‌మెంట్ పోస్టులను మాత్రం తొలగించలేదు. దీనిని బట్టి చూస్తే వివాహం అధికారికంగా రద్దు కాలేదు అని అర్థమవుతోంది. ఏదేమైనా పాత పోస్టులు,స్నేహితుల చర్యల కారణంగా ఈ వివాదం సోషల్ మీడియాలో మరింత పెరుగుతోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..