13 ఫోర్లు, 17 సిక్సర్లతో రికార్డ్ ఇన్నింగ్స్.. టీ20 హిస్టరీకే దడపుట్టించిన 5గురు తోపులు..!

Highest Individual Score T20: షేర్-ఎ-పంజాబ్ 2026లో నమన్ ధీర్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అమృత్‌సర్ సూర్మాస్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు 64 బంతుల్లో 173 పరుగులు చేశాడు. ఇది భారత రాష్ట్ర స్థాయి టీ20 లీగ్‌లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు, షేర్-ఎ-పంజాబ్ టోర్నీలోనూ కొత్త రికార్డు. అయితే ఐసీసీ గుర్తింపు కారణంగా టీ20 ప్రపంచ రికార్డు జాబితాలోకి చేరలేదు.

13 ఫోర్లు, 17 సిక్సర్లతో రికార్డ్ ఇన్నింగ్స్.. టీ20 హిస్టరీకే దడపుట్టించిన 5గురు తోపులు..!
Highest Individual Score T20

Updated on: Sep 09, 2026 | 7:34 PM

Highest Individual Score T20: షేర్-ఎ-పంజాబ్ 2026లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ నమన్ ధీర్ బ్యాట్‌తో సంచలనం సృష్టించాడు. అమృత్‌సర్ సూర్మాస్, మొహాలీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన ధీర్ కేవలం 64 బంతుల్లో 173 పరుగులు చేశాడు. కెప్టెన్ అభిషేక్ శర్మ స్థానంలో ఇన్నింగ్స్ ప్రారంభించిన అతడు భారీ స్కోరుతో తనదైన ముద్ర వేశాడు. నమన ధీర్ ఆడిన 173 పరుగుల ఇన్నింగ్స్ భారతదేశంలోని స్టేట్ లెవల్ టీ20 లీగ్ (State-level T20 leagues) లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదైంది. అంతేకాదు, షేర్-ఎ-పంజాబ్ టోర్నమెంట్ చరిత్రలోనూ ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. దీంతో అతడి ఇన్నింగ్స్ స్థానిక టీ20 క్రికెట్‌లో ప్రత్యేక రికార్డుగా నిలిచింది.

అయితే ఈ స్కోరుకు మరో ఆసక్తికరమైన మలుపు ఉంది. 173 పరుగులు చేసినా, టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల అధికారిక జాబితాలో నమన్ ధీర్‌కు రెండో స్థానం దక్కదు.

ఎక్కువమంది చదివినది: Video: 16 ఫోర్లు, 12 సిక్సర్లతో బీభత్సం.. 37 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కంటే డేంజరస్‌‌గా ఉన్నాడేందయ్యా..!

ఇవి కూడా చదవండి

ఐసీసీ గుర్తింపే కీలకం..!

దీనికి కారణం షేర్ ఈ పంజాబ్ టీ20 లీగ్ (Sher-E-Punjab T20 League)కు ఐసీసీ అధికారిక టీ20 హోదా ఇవ్వకపోవడమే. ఐసీసీ అధికారిక టీ20 పోటీలుగా గుర్తించే టోర్నీల్లో బీసీసీఐ (BCCI) నిర్వహించే సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy), ఐపీఎల్ (IPL) ఉన్నాయి. అందువల్ల రాష్ట్ర స్థాయి టీ20 లీగ్‌లో నమోదైన ధీర్ 173 పరుగులు అధికారిక టీ20 రికార్డుల లెక్కలోకి రావు.

అగ్రస్థానంలో క్రిస్ గేల్..

అధికారిక టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇప్పటికీ క్రిస్ గేల్ 175*. 2013 ఐపీఎల్ లో పుణే వారియర్స్ ఇండియా (Pune Warriors India) పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) తరపున గేల్ 66 బంతుల్లో అజేయంగా 175 పరుగులు చేశాడు. 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన అతడి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 17 సిక్సర్లు ఉన్నాయి.

ఎక్కువమంది చదివినది: Video: 20 ఏళ్ల తర్వాత తొలిసారి చెత్త రికార్గ్.. మరోసారి పాకిస్తాన్ ఇజ్జత్ పాయే.. అదేంటో తెలుసా?

రెండో స్థానంలో ఆరోన్ ఫించ్ 2018లో జింబాబ్వేపై చేసిన 172 పరుగులు ఉన్నాయి. 2026లో హంజా ఖాన్ ఐవరీ కోస్ట్‌పై 164తో మూడో స్థానంలో, కరణ్‌బీర్ సింగ్ హంగేరిపై 164తో నాలుగో స్థానంలో ఉన్నారు. హామిల్టన్ మసకడ్జా 2016లో ఈగల్స్‌పై చేసిన 162 ఐదో స్థానంలో ఉంది. నమన ధీర్ 173 పరుగులు ఈ స్కోర్ల కంటే ఎక్కువే అయినప్పటికీ, ఐసీసీ గుర్తింపు లేకపోవడంతో ఆ జాబితాలో చోటు దక్కలేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us