విరాట్, రోహిత్‌లకే సాధ్యం కాలే.. దేశవాళీలో రికార్డుల భీభత్సం సృష్టించిన సరికొత్త రన్ మెషిన్.. ఎవరంటే?

|

May 03, 2022 | 6:12 PM

భారత దేశవాళీ మహిళల టీ20 టోర్నీ సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో ఈ బ్యాటర్ కేవలం 7 మ్యాచ్‌ల్లో 162 పరుగుల ఇన్నింగ్స్‌తో సహా 525 పరుగులు చేసింది. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ వంటి స్టార్ ప్లేయర్లు ఈమె ప్రదర్శన ముందు నిలబడలేకపోయారు.

విరాట్, రోహిత్‌లకే సాధ్యం కాలే.. దేశవాళీలో రికార్డుల భీభత్సం సృష్టించిన సరికొత్త రన్ మెషిన్.. ఎవరంటే?
Women Cricket Kiran Navgire
Follow us on

సీనియర్ టీ20 మహిళల ట్రోఫీ(Senior Womens T20 Trophy) ప్రస్తుతం భారత్‌లో ప్రీమియర్ మహిళల టీ20 టోర్నమెంట్ పేరుతో జరుగుతోంది. 37 జట్లు ఈ టోర్నీలో పోటీపడుతున్నాయి. మొత్తం 142 మ్యాచ్‌లు జరుగుతాయి. ఏప్రిల్ 15న ప్రారంభమైన ఈ టోర్నీ మే 4న ఫైనల్ జరగనుంది. ఈ టోర్నీ భారత మహిళల క్రికెట్ జట్టుకు తుఫాన్ బ్యాటర్‌ని అందించింది. ఆమె నాగాలాండ్‌కు చెందిన కిరణ్ నవ్‌గిరే(Kiran Navgire). ఈ టోర్నీలో కిరణ్ బ్యాట్ ఘాటుగా మాట్లాడి ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకోవడంలో మునిగిపోయింది. ఈ క్రమంలో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ వంటి భారత క్రికెట్‌లోని కీలక ప్లేయర్లను విడిచిపెట్టింది. దీంతో పాటు ఇప్పటి వరకు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి లాంటి దిగ్గజాలు చేయలేని ఫీట్ చేసింది.

7 మ్యాచ్‌ల్లో 525 పరుగులు..

టోర్నీలో కిరణ్ నవ్‌గిరే 7 మ్యాచ్‌ల్లో 525 పరుగులు చేసింది. 131.25 సగటు, 172.69 స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు చేసింది. యాష్తికా భాటియా స్కోరింగ్ పరంగా రెండవ స్థానంలో నిలిచింది. ఆమె 325 పరుగులు మాత్రమే చేసింది. షెఫాలీ వర్మ 7 మ్యాచ్‌ల్లో 303 పరుగులతో మూడో స్థానంలో నిలిచింది.

162 పరుగులతో అజేయ ఇన్నింగ్స్‌..

అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కిరణ్ 76 బంతుల్లో 162 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయి. టీ20 క్రికెట్‌లో 150 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఈ పని చేయలేకపోయారు. అంతకుముందు, సయ్యద్ ముస్తాల్ అలీ ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్ చేసిన 147 పరుగులే టీ20లో ఏ భారతీయుడికీ అత్యధిక స్కోరుగా నిలిచింది.

18 బంతుల్లో యాభై పరుగులు..

మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో కిరణ్ 18 బంతుల్లో అర్ధశతకం సాధించింది. టోర్నీలో ఇది అత్యంత వేగవంతమైన అర్థసెంచరీగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేసింది. ఆ తర్వాత షెఫాలీ వర్మ నిలిచింది. ఈమె బ్యాట్ నుంచి 22 బంతుల్లో ఫిఫ్టీ వచ్చింది.

అథ్లెట్ కావాలని..

మహారాష్ట్రకు చెందిన కిరణ్ నవ్‌గిరే తన రాష్ట్రానికి చెందిన అగ్రశ్రేణి అథ్లెట్లలో ఒకటిగా నిలిచారు. జావెలిన్ త్రో 4×100 మీటర్ల రిలేలో అనేక పతకాలు సాధించింది. కానీ, 2017లో మహిళల ప్రపంచ కప్‌కు ముందు, కిరణ్ పూణెకు రావడంతో కెరీర్‌ని క్రికెట్ వైపు మళ్లించింది.

మహారాష్ట్ర తరపున..

దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్ర తరఫున కిరణ్ అరంగేట్రం చేసింది. కానీ, కరోనా తర్వాత క్రికెట్ ప్రారంభమైనప్పుడు, ఆమెకు జట్టులో స్థానం లభించలేదు. నాగాలాండ్‌కు గెస్ట్ ప్లేయర్‌లు అవసరమని తెలుసుకుని దరఖాస్తు చేసుకోవడంతో ఎంపికైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: IPL 2022: ‘అతను మరో మహేంద్ర సింగ్ ధోని.. కూల్‌గా క్లైమాక్స్‌లో విధ్వంసం’

IPL 2022: ప్లేఆఫ్‌ బరిలో కొత్త జట్లు.. లిస్టులో చేరిన మరో రెండు.. 47 మ్యాచ్‌ల తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే?