Video: IND vs ENG మ్యాచ్‌లో ఇది గమనించారా.. సాక్షి పొరపాటుకు ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే..

MS Dhoni Reaction to Sakshi Celebration: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ పోరుకు సెలబ్రెటీలు హాజరయ్యారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, ధోని ఫ్యామిలీలతోపాటు హాజరయ్యారు. అయితే, ఓ క్యాచ్‌ను తప్పుగా అంచనా వేసిన సాక్షి ధోని సెలబ్రేషన్స్‌ మొదలుపెట్టింది. కానీ, అది తప్పని తెలిసేలోపే ధోని కూల్ రియాక్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Video: IND vs ENG మ్యాచ్‌లో ఇది గమనించారా.. సాక్షి పొరపాటుకు ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే..
Ind Vs Eng Dhoni Reaction To Sakshi Video

Updated on: Mar 06, 2026 | 8:42 AM

MS Dhoni Reaction to Sakshi Celebration: టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ మైదానంలో మాత్రమే కాదు, స్టాండ్స్‌లో కూడా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముంబైలోని వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) తన భార్య సాక్షి ధోని (Sakshi Dhoni) తో కలిసి హాజరయ్యాడు.

సాక్షి సెలబ్రేషన్.. ధోనీ కూల్ రియాక్షన్..

ఇంగ్లాండ్ ఛేజ్ సమయంలో జరిగిన ఒక చిన్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. 18వ ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) బౌలింగ్ చేస్తుండగా ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరణ్ (Sam Curran) బలంగా షాట్ ఆడాడు. బుమ్రా బంతిని పట్టకున్న వెంటనే సాక్షి ధోనీ అది క్యాచ్ అని భావించి ఆనందంగా ఎగిరి పడింది. కానీ నిజానికి బంతి నేలను తాకిన తర్వాత బుమ్రా చేతికి వచ్చింది.

అది గమనించిన ధోనీ తనకు ప్రత్యేకమైన “కెప్టెన్ కూల్” స్టైల్లో సాక్షిని శాంతించమని సిగ్నల్ ఇచ్చాడు. ఈ రియాక్షన్ చూసి అక్కడ ఉన్న అభిమానులు, సెలబ్రిటీలు నవ్వులు పూయించారు. ఈ సీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

స్టేడియంలో స్టార్స్ సందడి..

ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. వారిలో రోహిత్ శర్మ (Rohit Sharma) ఆయన భార్య (Ritika Sajdeh) కూడా VIP బాక్స్‌లో కనిపించారు. అలాగే బాలీవుడ్ హీరోహీరోయిన్లు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు హాజరయ్యారు.

సంజూ శాసన్ మెరుపు ఇన్నింగ్స్..

ఈ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. సంజూ శాంసన్ (Sanju Samson) అద్భుతంగా ఆడి 42 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. అతనికి తోడుగా
శివం దుబే 43 పరుగులతో దుమ్మురేపాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 253/7 భారీ స్కోర్ నమోదు చేసింది.

చివరి వరకు పోరాడిన ఇంగ్లాండ్..

254 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ చివరి వరకు పోరాడింది. జాకెబ్ బెథెల్ (Jacob Bethell) అద్భుతంగా ఆడి 48 బంతుల్లో 105 పరుగులు చేశాడు. అయినప్పటికీ ఇంగ్లాండ్ 246/7 స్కోర్‌కే పరిమితమైంది. దీంతో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో భారత్..

ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత్ న్యూజిలాండ్ (IND vs NZ) జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. భారత్ వరుసగా రెండో టైటిల్ సాధించేందుకు సిద్ధమవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us