Most Ducks in T20 Cricket: వీరంతా టీ20 స్టార్ ప్లేయర్లు.. డకౌట్‌లో మాత్రం పోటీపడి మరీ రికార్డులు.. ఎవరో తెలుసా?

|

Sep 16, 2021 | 12:10 PM

క్రికెట్‌లో, ఏ బ్యాట్స్‌మన్ సున్నాకి అవుట్ అవ్వాలని కోరుకోడు. అది వారికి ఒక పీడకల లాంటిది. కానీ, కొందరు బ్యాట్స్‌మెన్‌లు ఇందులో కూడా రికార్డులు సృష్టించారు.

Most Ducks in T20 Cricket: వీరంతా టీ20 స్టార్ ప్లేయర్లు.. డకౌట్‌లో మాత్రం పోటీపడి మరీ రికార్డులు.. ఎవరో తెలుసా?
West Indies Players
Follow us on

Most Ducks in T20 Cricket: క్రికెట్ ఆట ఎప్పుడూ ఓకేలా ఉండదు. ఒక మ్యాచ్‌లో చేసిన తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన వారు.. తదుపరి మ్యాచ్‌లో జీరోగా మారిపోతుంటారు. ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. బ్యాట్స్ మెన్స్ ఇక్కడ పరుగులు చేయాలనుకుంటున్నారు. అలాగే బౌలర్లు వికెట్లు తీయాలనుకుంటున్నారు. ఏ బ్యాట్స్‌మెన్ అయినా సున్నాకి ఔట్ కావాలని కోరుకోడు. అదే సమయంలో బౌలర్ మాత్రం బ్యాట్స్‌మెన్‌ను ఎక్కువ సేపు క్రీజులో ఉంచాలని కోరుకోడు. త్వరగా పెవిలియన్ చేర్చాలని ప్రయత్నిస్తుంటాడు. సున్నాకి ఔట్ కావడం బ్యాట్స్‌మెన్‌కు పీడకల లాంటిది. ప్రస్తుతం టీ20 హవా నడుస్తోంది. 19నుంచి ఐపీఎల్ మొదలు కానుండగా, వచ్చే నెలలో పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టీ 20 ఫార్మాట్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్‌ల గురించి తెలుసుకుందాం.

ఈ జాబితాలో మొదటి పేరు టీ20లో విధ్వంసకర బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందిన ఆటగాడి పేరుండడం విశేషం. టీ 20 లో అత్యధిక స్కోరు కూడా ఆ ఆటగాడి పేరుతో ఉండడం విశేషం. ఐపీఎల్ నుంచి సీపీఎల్ వరకు ఈ ఆటగాడు సందడి చేస్తూనే ఉన్నాడు. ఆయనెవరో కాదు వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్. గేల్ తన కెరీర్‌లో మొత్తం 30 సార్లు సున్నాకి ఔట్ అయ్యాడు. సీపీఎల్ 2021 టైటిల్ మ్యాచ్‌లోనూ గేల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. గేల్ తన కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 446 టీ 20 మ్యాచ్‌లు ఆడాడు.

గేల్ తరువాత వెస్టిండీస్‌కే చెందిన ప్లేయర్ సునీల్ నరైన్ పేరు చేరింది. నరైన్ 28 సార్లు టీ 20 లో సున్నాకి ఔట్ అయ్యాడు. నరేన్ ఆఫ్-స్పిన్ బౌలింగ్‌కు పేరుగాంచినప్పటికీ, కొన్నిసార్లు అతను బ్యాట్‌తో కూడా అద్భుతాలు చేస్తాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఓపెనర్‌గా రాణించాడు. సీపీఎల్‌లో ఎపెనింగ్ చేశాడు. నరేన్ ఇప్పటివరకు మొత్తం 373 టీ 20 మ్యాచ్‌లు ఆడాడు.

నరేన్ తర్వాత మరో వెస్టిండీస్ క్రికెటరే ఈ లిస్టులో ఉండడం విశేషం. లెండెల్ సిమన్స్ కూడా నరైన్‌తో సమానంగా టీ20 క్రికెట్‌లో 28 సార్లు సున్నాకి పెవలియన్ చేరాడు. అతను తన కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 283 టీ 20 మ్యాచ్‌లు ఆడాడు.

వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్ స్మిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. స్మిత్ తన టీ 20 కెరీర్‌లో మొత్తం 28 సార్లు ఔట్ అయ్యాడు. 2017 లో స్మిత్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అతను తన కెరీర్‌లో మొత్తం 337 టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 7870 పరుగులు చేశాడు. ఐపీఎల్, సీపీఎల్, పీఎస్‌ఎల్ వంటి లీగ్‌లలో ఆడాడు.

Also Read: Ashes Series: యాషెస్ సిరీస్‌లో సంక్షోభం.. ఇంగ్లండ్ ఆటగాళ్లు బహిష్కరించే అవకాశం.. ఎందుకో తెలుసా

వికెట్ కీపర్ నుంచి ఐసీసీ సీఈవో వరకు.. బహిష్కరణ తరువాత దక్షిణాఫ్రికా క్రికెట్ టీంకు ప్రాణం పోసిన ప్లేయర్ ఎవరో తెలుసా?