MI vs SRH Playing XI: టాస్ గెలిచిన ముంబై.. డేంజరస్ ప్లేయర్ మిస్సయ్యాడుగా..!

IPL ముంబై ఇండియన్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్ Playing XI: ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య మొత్తం 25 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ముంబై ఇండియన్స్ ఆధిపత్యం చెలాయించింది. ముంబై 14 మ్యాచ్‌లు గెలవగా, హైదరాబాద్ 10 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ టై కాగా, దానిని ముంబై సూపర్ ఓవర్‌లో గెలుచుకుంది.

MI vs SRH Playing XI: టాస్ గెలిచిన ముంబై.. డేంజరస్ ప్లేయర్ మిస్సయ్యాడుగా..!
Mi Vs Srh Toss Update

Updated on: Apr 29, 2026 | 7:19 PM

Mumbai Indians vs Sunrisers Hyderabad, 41st Match: ఈరోజు, ఐపీఎల్ 2026లో భాగంగా 41వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. వాంఖడే స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ జట్టు తొలుత బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తిరిగి బరిలోకి దిగనున్నాడు.

ఈ సీజన్‌లో ముంబై ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదింటిలో ఓడిపోయింది. దీంతో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. మరోవైపు, హైదరాబాద్ మెరుగైన ఫామ్‌లో ఉంది. హైదరాబాద్ జట్టు వరుసగా తన చివరి నాలుగు మ్యాచ్‌లలో గెలిచి, ఇప్పుడు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

ఇది కూడా చదవండి: Punarnava Dal: ఇది కూర కాదు.. ఒంట్లో పార్ట్స్ అన్నీ రిపేర్ చేసే సంజీవని.. ఎలా వండాలో తెలుసా?

ఇరు జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్ష్ దూబే, సకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: ర్యాన్ రికెల్టన్(కీపర్), విల్ జాక్స్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, AM గజన్‌ఫర్, అశ్వనీ కుమార్.

Follow Us