Watch Video: అభిమానుల దెబ్బకు.. హిట్‌మ్యాన్ పరేషాన్.. ఎందుకో తెలుసా? నెట్టింట వైరల్ వీడియో..

Rohit Sharma Viral Video: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. రోహిత్ సారథ్యంలో భారత్ ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Watch Video: అభిమానుల దెబ్బకు.. హిట్‌మ్యాన్ పరేషాన్.. ఎందుకో తెలుసా? నెట్టింట వైరల్ వీడియో..
Rohit Sharma (2)

Updated on: Aug 17, 2022 | 7:24 AM

Rohit Sharma Viral Video: ఇండియాలో స్టార్ క్రికెటర్లకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. సోమవారం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోని ఓ హోటల్‌లో ఉన్నప్పుడు అలాంటిదే జరిగింది. రోహిత్‌ని చూసేందుకు ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు. వేలాది మంది ప్రజలు హోటల్ వెలుపల రహదారిపైకి వచ్చారు. దీని కారణంగా అక్కడి పరిస్థితిని నిర్వహించడంలో భద్రతా సిబ్బంది ఇబ్బంది పడాల్సి వచ్చింది.

వైరల్ అవుతున్న వీడియో..

ఇవి కూడా చదవండి

రోహిత్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు హోటల్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉండగా.. అంతకు ముందు జనాలు పెద్దఎత్తున వచ్చి రోడ్డుపై నిలబడ్డారు. జనాన్ని చూసి భయపడిన రోహిత్ వెనక్కి వెళ్లిపోయాడు. రోహిత్ అభిమానుల వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆగస్ట్ 15న రోహిత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అభిమానులకు, దేశప్రజలకు ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం అని రాసుకొచ్చాడు. దీనికి నేను కృతజ్ఞుడను, అదృష్టవంతుడిని అంటూ రాసుకొచ్చాడు.

రోహిత్ నాయకత్వంలో భారత్ ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో గెలుచుకున్న సంగతి తెలిసిందే. UAEలో ఆగస్ట్ 27న ప్రారంభం కానున్న ఆసియా కప్ 2022కి ఇప్పుడు రోహిత్ నాయకత్వం వహించనున్నాడు. ఆగస్టు 28న పాకిస్థాన్ జట్టుతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరగనుంది.

ఆసియా కప్ 2022 కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (కీపర్), దినేష్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ , యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్ అర్ష్దీప్ సింగ్ మరియు అవేష్ ఖాన్.

స్టాండ్‌బై ఆటగాళ్లు: శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్.

Loading...
Unable to load recommendations.
Follow Us