IND vs SA Test Result : టెస్ట్ చరిత్రలో మరోసారి ఘోర వైఫల్యం.. సౌతాఫ్రికాపై 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారీ షాక్ తగిలింది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియాపై టెంబా బవుమా కెప్టెన్సీలోని సౌత్ ఆఫ్రికా జట్టు 30 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. సౌతాఫ్రికా భారత్ ముందు కేవలం 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచినా, ఈ టార్గెట్‌ను ఛేదించడంలో భారత జట్టు పూర్తిగా విఫలమైంది.

IND vs SA Test Result : టెస్ట్ చరిత్రలో మరోసారి ఘోర వైఫల్యం.. సౌతాఫ్రికాపై 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి
Ind Vs Sa Test Result

Updated on: Nov 16, 2025 | 2:27 PM

IND vs SA Test Result : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారీ షాక్ తగిలింది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియాపై టెంబా బవుమా కెప్టెన్సీలోని సౌత్ ఆఫ్రికా జట్టు 30 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. సౌతాఫ్రికా భారత్ ముందు కేవలం 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచినా, ఈ టార్గెట్‌ను ఛేదించడంలో భారత జట్టు పూర్తిగా విఫలమైంది. భారత ఇన్నింగ్స్ కేవలం 93 పరుగులకే ముగిసింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సౌత్ ఆఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ సున్నా పరుగులకే, కేఎల్ రాహుల్ కేవలం 1 పరుగుకే అవుటవ్వడంతో పతనం మొదలైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగలేకపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, వాషింగ్టన్ సుందర్ 92 బంతుల్లో 31 పరుగులు చేసి పోరాడాడు. కానీ అతనికి మరో వైపు నుంచి సరైన సహకారం లభించలేదు. చివర్లో అక్షర్ పటేల్ కొన్ని ధాటిగా షాట్లు ఆడి (ఒక ఓవర్‌లో 16 పరుగులు) ఆశలు రేపినా, చివరికి అతనూ అవుటయ్యాడు. సౌతాఫ్రికా బౌలర్ల ముందు భారత్ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా చేతులెత్తేసింది.

సౌతాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించిన బౌలర్ సైమన్ హార్మర్. అతను రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 8 వికెట్లు పడగొట్టి, భారత బ్యాటింగ్ లైనప్‌ను కూల్చేశాడు. అతని అద్భుతమైన బౌలింగ్ సౌత్ ఆఫ్రికా విజయాన్ని సులభతరం చేసింది. అటు బ్యాటింగ్ విషయానికి వస్తే, సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా రెండో ఇన్నింగ్స్‌లో 55 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరు 153కు చేరడంలో తోడ్పడ్డాడు.

ఈ టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు చూస్తే..

సౌతాఫ్రికా: మొదటి ఇన్నింగ్స్ – 159 పరుగులు; రెండవ ఇన్నింగ్స్ – 153 పరుగులు (టెంబా బవుమా 55).

భారత్: మొదటి ఇన్నింగ్స్ – 189 పరుగులు (30 పరుగుల ఆధిక్యం); రెండవ ఇన్నింగ్స్ – 93 పరుగులు.

సౌతాఫ్రికా విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ విఫలమై 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌తో 1997లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ (120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై 38 పరుగుల తేడాతో ఓడింది) తర్వాత, టెస్ట్ క్రికెట్ చరిత్రలో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ మరోసారి ఘోరంగా విఫలమైంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..