ఐపీఎల్ హిస్టరీలో 13 ఏళ్ల ఐరెన్ లెగ్ ప్లేయర్.. ఏ జట్టులో చేరినా ట్రోఫీకి దూరమవ్వాల్సిందే..?

IPL Unluckiest Player: క్రికెట్ లో ఎంత ప్రతిభ ఉన్నా కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి రావాలని అంటుంటారు. కేఎల్ రాహుల్ ఐపీఎల్ ప్రయాణాన్ని గమనిస్తే ఇది అక్షరాలా నిజమనిపిస్తుంది. మైదానంలో పరుగుల వరద పారించినా, అదృష్టానికి ఆమడ దూరంలో ఉండిపోతున్న రాహుల్, భవిష్యత్తు సీజన్లలోనైనా ఈ ఐపీఎల్ శాపాన్ని బద్దలు కొట్టి ట్రోఫీని ముద్దాడుతాడో లేదో చూడాలి.

ఐపీఎల్ హిస్టరీలో 13 ఏళ్ల ఐరెన్ లెగ్ ప్లేయర్.. ఏ జట్టులో చేరినా ట్రోఫీకి దూరమవ్వాల్సిందే..?
Ipl Unluckiest Player
Image Credit source: AI genarated Image

Updated on: May 26, 2026 | 4:05 PM

IPL Unluckiest Player: భారత క్రికెట్ చరిత్రలో ఈ ప్లేయర్ క్లాస్ షాట్లకు, అద్భుతమైన బ్యాటింగ్ శైలికి ప్రత్యేక పేజీలు ఉన్నాయి. కానీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేదికపైకి వచ్చేసరికి ఈ స్టార్ ఆటగాడిని దురదృష్టం నీడలా వెంటాడుతోంది. అతను ఎంత శ్రమించినా, ఎన్ని పరుగులు సాధించినా.. ఫలితం లేకుండా పోతోంది. ఎందుకంటే, ఏ జట్టులో అడుగుపెడితే ఆ జట్టుకు మాత్రం ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలిపోవడం గమనార్హం. ఆ ప్లేయర్ ఎవరో టీమిండియా క్లాస్ ప్లేయర్ కేఎల్ రాహుల్.

పదమూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. మారని తలరాత..!

కేఎల్ రాహుల్ ఐపీఎల్ ప్రస్థానం 2013లో ప్రారంభమైంది. దాదాపు 13 సంవత్సరాలుగా ఈ పొట్టి ఫార్మాట్ టోర్నీలో రాహుల్ విభిన్న జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు. వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు సృష్టించినప్పటికీ, జట్టుగా ఐపీఎల్ కప్పును ముద్దాడే భాగ్యం మాత్రం అతనికి దక్కలేదు. ఐపీఎల్ 2026 సీజన్ లోనైనా తన తలరాత మారుతుందని ఆశించిన రాహుల్ కు ఈసారి కూడా తీవ్ర నిరాశే ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన అతను, ఈ సీజన్ లోనూ ఖాళీ చేతులతోనే ఇంటిబాట పట్టాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి: ‘అందరూ ఓ లెక్క.. ఆ ముగ్గురు మరో లెక్క.. ఆ జట్టుతో ప్లేఆఫ్స్ ఆడడం కంటే మీ బౌలర్లకు రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్’

ఇవి కూడా చదవండి

ప్లే ఆఫ్స్ చేరకుండానే ఢిల్లీ అవుట్..!

ఈ ఏడాది టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌లలో ఏడు విజయాలు, ఏడు ఓటములతో సరిపెట్టుకుంది. కీలకమైన సమయాల్లో జట్టు చేతులెత్తేయడం, రన్ రేట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ అధికారికంగా నిష్క్రమించింది. దీంతో రాహుల్ ఖాతాలో మరో ఐపీఎల్ పరాజయం చేరింది.

జట్లు మారినా అదృష్టం రాలేదు బాస్..!

ఇది కూడా చదవండి: IPL 2026 Playoffs: ఎవరు గెలిచినా సరికొత్త చరిత్రే.. అక్కడే ఉంది అసలైన ట్విస్ట్..!

రాహుల్ ఐపీఎల్ కెరీర్‌లో ఎన్నో అగ్రశ్రేణి జట్లకు ఆడిన సంగతి తెలిసిందే.

2013, 2016: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)

2014: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)

2018 – 2021: పంజాబ్ కింగ్స్ (PBK) – కెప్టెన్‌గా బాధ్యతలు

2022 – 2024: లక్నో సూపర్ జెయింట్స్ (LSG) – కెప్టెన్‌గా బాధ్యతలు

2025 – 2026: ఢిల్లీ క్యాపిటల్స్ (DC)

ఇది కూడా చదవండి: IPL 2026 Winner: ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే.. ట్రోఫీ పట్టుకపోయేది మాత్రం వాళ్లే: రికీ పాంటింగ్

చిత్రమేమిటంటే, రాహుల్ ఏ జట్టులో అయితే ఉంటాడో ఆ జట్టు కాకుండా, అతను వదిలేసిన జట్లు తర్వాతి కాలంలో కప్పులు గెలిచాయి. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రోఫీ సాధించినప్పుడు రాహుల్ ఆర్సీబీలో ఉన్నాడు. ఇక ఆర్సీబీ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2025లో తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలవగా, ఆ సీజన్ లో రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి చేరాడు. మరోవైపు అతను కెప్టెన్సీ చేసిన లక్నో, పంజాబ్ జట్లతో పాటు ప్రస్తుత ఢిల్లీ జట్టుకు కూడా ఐపీఎల్ కప్పు ఇప్పటికీ ఒక కలగానే మిగిలిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us