మెల్‌బోర్న్ ఎంసీజీ వేదికగా జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు ఉత్కంఠ పోరు సాగింది. చివరకు ఈ పోరులో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. దీనికి టీమిండియా దురదృష్టం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 173 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయింది. అయితే నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్ 10వ వికెట్‌కు 55 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
చివరి వికెట్ దక్కించుకోవడానికి టీమిండియా బౌలర్లు నానా తంటాలు పడ్డారు. ముఖ్యంగా జస్‌ప్రీత్ బుమ్రా వేసిన నాలుగో రోజు చివరి ఓవర్‌లో నాథన్ లియాన్ స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చాడు. ఈ క్యాచ్ పట్టేందుకు తడబడ్డ రాహుల్ ఎట్టకేలకు బంతిని లెగ్ మధ్యలో పట్టుకున్నాడు. చివరి వికెట్ పడగానే టీమిండియా అభిమానులు సంబురాలు చేసుకున్నారు. అయితే కొద్ది క్షణాల్లో అంపైర్ నోబాల్‌కి కాల్ చేశాడు. ఆఖరి ఓవర్లో నాథన్ లియాన్ అవుట్ అయినప్పటికీ, అది నో బాల్.
జస్‌ప్రీత్ బుమ్రా నో బాల్ అని తెలియడంతో నిరాశతో మళ్లీ బౌలింగ్‌కు వెళ్లాడు. దీని తర్వాత అతను మూడు బంతులు వేసినా వికెట్ దక్కించుకోలేకపోయాడు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. దీంతో ఐదో రోజు బ్యాటింగ్‌ను ఆసీస్ నిలబెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసింది. దీని తర్వాత టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ ఆడిన నితీశ్ కుమార్ రెడ్డి (114) సెంచరీ సాధించాడు. ఈ సెంచరీ సాయంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు శుభారంభం లభించలేదు. 8 పరుగులు చేసి సామ్ కొన్‌స్టాస్ ఔట్ కాగా, ఉస్మాన్ ఖవాజా 21 పరుగులు చేసి వికెట్ కోల్పోపోయాడు.
#INDvsAUSTest
Bumrah claimed the final wicket, and KL Rahul made a spectacular catch with his legs, but in the end, it turned out to be a no-ball. ☹️ pic.twitter.com/YHcO29MN2O— VS (@vstechsolution) December 29, 2024
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి