ఇండోర్ వేదికగా మంగళవారం (జనవరి 24) న్యూజీలాండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ రోహిత్, గిల్ సెంచరీల కారణంగా నిర్ణీత 50 ఓవర్లలో 385 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆతర్వాత న్యూజిలాండ్ 41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఓడినా ఆ జట్టు బ్యాటర్ డేవిడ్ కాన్వే మెరుపు సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్‌గా వచ్చిన అతను మొత్తం 100 బంతుల్లో 138 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. సహచరులు ఒక్కొక్కరు వెనుదిరుగుతున్నా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ టీమిండియాను తెగ టెన్షన్ పెట్టాడు. అయితే 32 ఓవర్లో 230 పరుగులు వద్ద కాన్వే ఆరో వికెట్‌ను వెనుదిరిగాడు. ఆతర్వాత కివీస్ జట్టు పేకమేడలా కుప్పకూలింది. 90 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. కాగా ఈ మ్యాచ్‌లో కాన్వే కండరాలు పట్టేశాయి. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. దీంతో పెయిన్ కిల్లర్స్ తీసుకుని ఆడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని కామెంటరీ బాక్స్‌లో కూర్చున్న సంజయ్ మంజ్రేకర్ తెలియజేశాడు.
కాగా కొన్ని రోజుల క్రిత జరిగన పాకిస్తాన్ పర్యటనలో అద్భుతంగా రాణించాడు కాన్వే. వన్డే సిరీస్‌లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించాడు. అంతకుముందు రెండు టెస్టుల సిరీస్‌లో ఒక సెంచరీ, అర్ధ సెంచరీ కొట్టాడు. అయితే భారత్‌తో జరిగిన మొదటి రెండు మ్యాచ్‌లలో పెద్దగా రాణించలేకపోయాడు. అయితే ఇండోర్‌లో మాత్రం సెంచరీతో చెలరేగాడు. తాజా సెంచరీతో భారత్‌పై వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో న్యూజిలాండ్ బ్యాటర్‌గా కాన్వే నిలిచాడు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో మైకేల్ బ్రేస్‌వెల్ 57 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
An exceptional knock from Devon Conway ?#INDvNZ | ?: https://t.co/6LY0ffX9t8 pic.twitter.com/no5n0LbIBq
— ICC Media (@ICCMedia) January 24, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..