Team India: 12 నెలలు దూరం.. కట్ చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 596 పరుగులు.. ధోని ఫ్రెండ్ రీ-ఎంట్రీ!

ఐపీఎల్‌లో వద్దన్నారు.. జాతీయ జట్టు నుంచి పొమ్మన్నలేక.. పొగబెట్టారు.. కట్ చేస్తే.. ఈ ప్లేయర్ దేశవాళీ క్రికెట్‌లో..

Team India: 12 నెలలు దూరం.. కట్ చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 596 పరుగులు.. ధోని ఫ్రెండ్ రీ-ఎంట్రీ!
Kedar Jadhav

Updated on: Jan 25, 2023 | 7:40 PM

ఐపీఎల్‌లో వద్దన్నారు.. జాతీయ జట్టు నుంచి పొమ్మన్నలేక.. పొగబెట్టారు.. కట్ చేస్తే.. ఈ ప్లేయర్ దేశవాళీ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. అతడు బ్యాట్‌తో సృష్టించిన బీభత్సం.. ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయింది. అతడెవరో కాదు.. 12 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న కేదార్ జాదవ్. రంజీ ట్రోఫీలో కేదార్ జాదవ్ మెరుపులు మెరిపించాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర తరపున బరిలోకి దిగిన కేదార్ జాదవ్ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. 168 బంతుల్లో 128 పరుగులు సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడికి ఇది 15వ సెంచరీ.

కేదార్ జాదవ్ ఫామ్, ఫిట్‌నెస్ ఎప్పుడూ ప్రశ్నార్థకమే. అందుకే ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. కేదార్ రీ-ఎంట్రీ ఇచ్చే ముందు నవంబర్ 2021లో చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత, నవంబర్ 2022లో, రంజీ ట్రోఫీలో కనిపించాడు. ఈ టోర్నమెంట్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో కేవలం 43 పరుగులు మాత్రమే చేసిన జాదవ్.. ఆ తర్వాతి 5 ఇన్నింగ్స్‌ల్లో రెచ్చిపోయాడు. ఈ సమయంలో అతడి బ్యాట్ నుంచి ఓ డబుల్ సెంచరీ, ఒక సెంచరీ, 2 అర్ధ సెంచరీలు వచ్చాయి. మొత్తంగా 7 ఇన్నింగ్స్‌లలో 596 పరుగులు చేశాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us