Jos Buttler: జోస్‌ బట్లర్‌ని జట్టు నుంచి తొలగించారు.. కానీ ఇప్పుడు వారే సెల్యూట్‌ చేస్తున్నారు..!

Jos Buttler: జోస్ బట్లర్ ఐపీఎల్‌ 2022లో అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. మొత్తం టోర్నీలో బట్లర్ 4 సెంచరీల సాయంతో 863 పరుగులు చేశాడు.

Jos Buttler: జోస్‌ బట్లర్‌ని జట్టు నుంచి తొలగించారు.. కానీ ఇప్పుడు వారే సెల్యూట్‌ చేస్తున్నారు..!
Jos Buttler
Follow us

|

Updated on: Jun 01, 2022 | 7:51 PM

Jos Buttler: జోస్ బట్లర్ ఐపీఎల్‌ 2022లో అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. మొత్తం టోర్నీలో బట్లర్ 4 సెంచరీల సాయంతో 863 పరుగులు చేశాడు. ఐపీఎల్ ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో స్థానం సంపాదించాడు. అయితే రాజస్థాన్ రాయల్స్‌ను ఛాంపియన్‌గా చేయలేకపోయాడు. కానీ బట్లర్ బ్యాటింగ్ మాత్రం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుని అలర్ట్‌ చేసింది. ఐపిఎల్‌కి ముందు బట్లర్‌ని టెస్ట్ జట్టు నుంచి తొలగించారు. ఇప్పుడు ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన తర్వాత బట్లర్‌ తిరిగి జట్టులకి రాగలడని ఇంగ్లండ్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ ప్రస్తావించారు.

ఇంగ్లండ్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ.. బట్లర్‌ని ప్రశంసిస్తూ అతడి టెస్ట్ కెరీర్ ముగిసిపోలేదని అతను త్వరలో రెడ్ బాల్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అవుతాడని చెప్పాడు. రాబ్ కీ మాట్లాడుతూ ‘బట్లర్ తిరిగి వస్తాడని నేను భావిస్తున్నాను. అతను టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ గురించి ఆలోచించకూడదని కోరుకుంటున్నాను. రెడ్ బాల్ ఆటపై తనకు ఆసక్తి లేదని చెబితే అది వేరే విషయం. కానీ బట్లర్ అలా ఆలోచించడని నేను అనుకుంటున్నాను. బట్లర్ గొప్ప టెస్ట్ క్రికెటర్ కాగలడని నేను ఎప్పుడో భావించానని’ తెలిపాడు.

యాషెస్‌లో బట్లర్ పేలవ ప్రదర్శన

ఇవి కూడా చదవండి

57 టెస్టులు ఆడిన జోస్ బట్లర్‌కు యాషెస్ సిరీస్ కలిసి రాలేదు. ఈ ఆటగాడు ఆస్ట్రేలియాలో 15.28 సగటుతో 107 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంతేకాదు ఈ సమయంలో బట్లర్ గాయపడటంతో అతని స్థానంలో బెన్ ఫాక్స్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాడు. బట్లర్‌ను టెస్ట్ జట్టు నుంచి తొలగించిన తర్వాత ఇంగ్లాండ్.. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌ను 0-1తో కోల్పోయింది. ఆ తర్వాత జట్టు కెప్టెన్, కోచ్ ప్రతిదీ మార్చారు. ఇప్పుడు ఇంగ్లండ్ టెస్టు జట్టు కమాండ్ బెన్ స్టోక్స్ చేతిలో ఉంది. బ్రెండన్ మెకల్లమ్ కొత్త టెస్ట్ హెడ్ కోచ్. అండర్సన్-బ్రాడ్ కూడా తిరిగి జట్టులోకి వచ్చారు. నెక్స్ట్‌ బట్లర్‌ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో