టీ20ల్లో జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డు.. దిగ్గజాల సరసన అరుదైన ఘనత..!

గాయం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) పొట్టి ఫార్మాట్ లో అరుదైన రికార్డును నెలకొల్పాడు. అఫ్గానిస్థాన్ (Afghanistan) తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టి, టీ20 క్రికెట్‌లో 350 వికెట్ల మైలురాయిని చేరుకున్న మూడో భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

టీ20ల్లో జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డు.. దిగ్గజాల సరసన అరుదైన ఘనత..!
Jasprit Bumrah

Updated on: Sep 13, 2026 | 8:54 PM

ఇంగ్లండ్ పర్యటనలో మోకాలి గాయం బారిన పడిన 32 ఏళ్ల జస్ప్రీత్ బుమ్రా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో పునరావాసం పూర్తి చేసుకుని తిరిగి మైదానంలోకి దిగాడు. అఫ్గానిస్థాన్‌తో తలపడుతున్న టీ20 పోరులో బౌలింగ్ ప్రారంభించిన అతడు, మొదటి ఓవర్లోనే ప్రమాదకర ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (Rahmanullah Gurbaz) ను పెవిలియన్‌కు పంపాడు. హార్డ్ లెంగ్త్ బంతితో గుర్బాజ్‌ను బోల్తా కొట్టించగా, మొదటి స్లిప్‌లో ఉన్న అభిషేక్ శర్మ (Abhishek Sharma) అద్భుత క్యాచ్‌గా అందుకున్నాడు. ఈ వికెట్‌తో భారత క్రికెట్ జట్టు (Team India) తరఫున బుమ్రా టీ20 ఫార్మాట్‌లో సరికొత్త మైలురాయిని తాకాడు. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌కు సైతం దూరమైన ఈ పేస్ గుర్రం, రీఎంట్రీ మ్యాచ్‌లోనే తనదైన శైలిలో వికెట్ ఖాతా తెరిచి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు.

ఎక్కువమంది చదివినది: Video: ఫైనల్ పోరులో క్రికెటర్ల రచ్చ.. అంపైర్లు అడ్డుగా వచ్చినా మైదానంలోనే పొట్టుపొట్టుగా.. !

టీ20 క్రికెట్ చరిత్రలో 350 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal), భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) సరసన బుమ్రా స్థానం సంపాదించాడు. ప్రస్తుతం చాహల్ 396 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భువనేశ్వర్ 363 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తాజా వికెట్‌తో 350 మార్కును తాకిన బుమ్రా, త్వరలోనే భువనేశ్వర్ రికార్డును అధిగమించే దిశగా సాగుతున్నాడు.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: Video: వామ్మో.. 11 ఫోర్లు, 9 సిక్సర్లతో విధ్వంసం.. 44 బంతుల్లోనే టార్గెట్‌ ఫినిష్..!

ఈ 350 వికెట్లలో భారత జాతీయ జట్టుకు ఆడిన 95 అంతర్జాతీయ టీ20లలో 122 వికెట్లు సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు తరఫున 158 మ్యాచ్‌లలో 7.34 ఎకానమీతో 187 వికెట్లు కూల్చాడు. మిగిలిన వికెట్లను దేశవాళీ పోటీల్లో రాబట్టాడు. పవర్‌ప్లేలోనే కాకుండా మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లలో కచ్చితమైన యార్కర్లు, కట్టర్లతో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో బుమ్రాకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us