AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ruturaj Gaikwad: ఒక్క సెంచరీ కాదు.. వరుసగా మూడు 109లు.. రుతురాజ్‌ను దాటేసిన ఇంగ్లాండ్ బ్యాటర్

Ruturaj Gaikwad: లిస్ట్ ఏ క్రికెట్‌లో జాక్ లిబ్బీ వరుసగా మూడు 109 పరుగుల ఇన్నింగ్స్‌లతో రుతురాజ్ గైక్వాడ్‌ను వెనక్కి నెట్టి నంబర్-1 బ్యాటింగ్ సగటును సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ 57.8 సగటుతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. లిబ్బీ సగటు 61.4గా నమోదైంది.

Ruturaj Gaikwad: ఒక్క సెంచరీ కాదు.. వరుసగా మూడు 109లు.. రుతురాజ్‌ను దాటేసిన ఇంగ్లాండ్ బ్యాటర్
Ruturaj Gaikwad
Rakesh
|

Updated on: Aug 09, 2026 | 2:43 PM

Share

Ruturaj Gaikwad: క్రికెట్ ప్రపంచంలో లిస్ట్ ఏ క్రికెట్ బ్యాటింగ్ యావరేజ్‎కు సంబంధించిన స్థానాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంగ్లాండ్‌కు చెందిన 33 ఏళ్ల అన్‌క్యాప్డ్ బ్యాటర్ జాక్ లిబ్బీ అద్భుతమైన ఫామ్‌తో టీమిండియా స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ జాబితాలో భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. జాక్ లిబ్బీ నమోదు చేసిన వరుస సెంచరీలతో లిస్ట్ ఏ క్రికెట్ బెస్ట్ యావరేజ్ కలిగిన బ్యాటర్ల జాబితా తలకిందులైంది.

హ్యాట్రిక్ 109లతో జాక్ లిబ్బీ సంచలనం

జాక్ లిబ్బీ తన అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. శుక్రవారం ససెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన నాటౌట్‌గా 109 పరుగులు చేశాడు. విశేషమేమిటంటే.. అంతకుముందు ఎసెక్స్, మిడిల్‌సెక్స్ జట్లతో జరిగిన మ్యాచ్‌లలో కూడా లిబ్బీ సరిగ్గా 109 చొప్పున పరుగులు సాధించడం విశేషం. ఇలా వరుసగా మూడు మ్యాచ్‌లలో మూడంకెల స్కోరు (109) నాటౌట్‌గా సాధించడంతో ఆయన సగటు ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం జాక్ లిబ్బీ 61.4 బ్యాటింగ్ సగటుతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచాడు. 2019లో లిస్ట్ ఏ అరంగేట్రం చేసిన లిబ్బీ, ఇప్పటివరకు 56 మ్యాచ్‌లలో 53 ఇన్నింగ్స్‌లు ఆడి 2,456 పరుగులు చేశాడు. ఇందులో 13 సార్లు నాటౌట్‌గా నిలవగా, 6 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 126 పరుగులు. ఇంకా ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు ఆడకపోయినా ఈ రికార్డు సాధించడం విశేషం.

రెండో స్థానానికి పడిపోయిన రుతురాజ్ గైక్వాడ్

జాక్ లిబ్బీ సంచలన ప్రదర్శనతో మహారాష్ట్ర స్టార్, భారత క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ రెండో స్థానానికి పరిమితమయ్యాడు. 2017లో లిస్ట్ ఏ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఇప్పటివరకు 104 మ్యాచ్‌లలో 58.61 సగటుతో 5,334 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతి పిన్న వయస్సులోనే లిస్ట్ ఏ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డులు నెలకొల్పిన రుతురాజ్ ఇప్పుడు లిబ్బీ సెంచరీల దాడితో తన నంబర్-1 స్థానాన్ని కోల్పోయాడు.

ఐదో స్థానంలో విరాట్ కోహ్లీ

ఈ జాబితాలోని ఇతర బెస్ట్ బ్యాటర్ల వివరాలను పరిశీలిస్తే, ఇంగ్లాండ్‌కు చెందిన సామ్ హేన్ 58.18 సగటుతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మైఖేల్ బెవాన్ 57.86 సగటుతో నాలుగో స్థానంలో నిలిచాడు. టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ 57.8 బ్యాటింగ్ సగటుతో ఐదో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ తన లిస్ట్ ఏ కెరీర్‌లో ఇప్పటివరకు 350 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 16,591 పరుగులు సాధించగా, అందులో అతని అత్యధిక స్కోరు 183 పరుగులుగా ఉంది.

Follow Us