
Yuzvendra Chahal Disha Patani Dating Rumors: భారత క్రికెట్ జట్టులో తనదైన శైలిలో లెగ్ స్పిన్‌తో మాయ చేసే యుజ్వేంద్ర చాహల్ ఆటతోనే కాకుండా, తన వ్యక్తిగత విషయాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజా సమాచారం ప్రకారం, చాహల్ బాలీవుడ్ హాట్ బాంబ్ దిశా పటానితో డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలు విన్న అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
సాధారణంగా సెలబ్రిటీల మధ్య చిన్నపాటి సాన్నిహిత్యం కనిపించినా లేదా సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు మరొకరు స్పందించినా నెటిజన్లు రకరకాల ఊహాగానాలు మొదలుపెడతారు. చహల్, దిశాల విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం, కొన్ని పోస్టులకు వచ్చిన స్పందనలు ఈ పుకార్లకు ఆజ్యం పోశాయి.
అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. చహల్ తన భార్య ధనశ్రీ వర్మతో విడిపోయారనే వార్తలు గతంలో వచ్చినప్పటికీ, వాటిపై స్పష్టత లేదు. ఇక దిశా పటాని విషయానికి వస్తే, ఆమె పేరు ఇటీవల ఒక పంజాబీ సింగర్‌తో వినిపిస్తోంది. చహల్, దిశా మధ్య కేవలం స్నేహం లేదా పరిచయం ఉండొచ్చేమో కానీ, వారు డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు కేవలం కట్టుకథలేనని సన్నిహిత వర్గాల సమాచారం.
చహల్ ప్రస్తుత పరిస్థితి: ప్రస్తుతం చహల్ తన క్రికెట్ కెరీర్‌పై దృష్టి పెట్టారు. టీమిండియాలో తిరిగి స్థానం సంపాదించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటు దిశా పటాని కూడా తన తదుపరి సినిమాలతో బిజీగా ఉన్నారు. కాబట్టి, వైరల్ అవుతున్న ఈ వార్తలను నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..