MI vs KKR IPL Match Result: ఇషాన్ ఊరమాస్ ఇన్నింగ్స్.. సూర్య క్లాస్ బ్యాటింగ్.. కేకేఆర్‌ను చిత్తుగా ఓడించిన ముంబై..

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వాంఖడే మైదానంలో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో నైట్ రైడర్స్‌పై విజయం సాధించింది.

MI vs KKR IPL Match Result: ఇషాన్ ఊరమాస్ ఇన్నింగ్స్.. సూర్య క్లాస్ బ్యాటింగ్.. కేకేఆర్‌ను చిత్తుగా ఓడించిన ముంబై..
Mi Vs Kkr Result

Updated on: Apr 16, 2023 | 7:30 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్-16 మూడో సూపర్ సండే తొలి మ్యాచ్ లో వాంఖడే మైదానంలో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో నైట్ రైడర్స్‌పై విజయం సాధించింది. KKRపై MIకి ఇది 23వ విజయం. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 32 మ్యాచ్‌లు జరిగాయి. ప్రస్తుత సీజన్ గురించి చెప్పాలంటే, ముంబైకి ఇది వరుసగా రెండో విజయం. పాయింట్ల పట్టికలో ఆ జట్టు 8వ స్థానంలో ఉంది.

ముంబై టాస్ గెలిచి తమ సొంత మైదానంలో బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు చేసింది. 186 పరుగుల లక్ష్యాన్ని ముంబై బ్యాట్స్‌మెన్ 17.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఇషాన్ తుఫాన్ ఇన్నింగ్స్..

ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 58 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ వెంకటేష్ అయ్యర్ సెంచరీని కప్పివేసింది. రోహిత్‌తో కలిసి 29 బంతుల్లో 65 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యంతో ఇషాన్ అదరగొట్టాడు. సూర్య, తిలక్ వర్మల అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో ముంబై ఘన విజయం సాధించింది.