Watch : వండర్ కిడ్ వైభవ్‌కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్.. ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత వైరల్ అవుతున్న వీడియో!

Watch : వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి ఎస్‌ఆర్‌హెచ్ క్యాంప్ సైతం ఫిదా అయిపోయింది. మ్యాచ్ అనంతరం కావ్య మారన్ వైభవ్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి, వెన్నుతట్టి ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఈ 15 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఈ ఐపీఎల్ సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు.

Watch : వండర్ కిడ్ వైభవ్‌కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్.. ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత వైరల్ అవుతున్న వీడియో!
Kavya Maran

Updated on: May 29, 2026 | 11:22 AM

Watch : ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఓటమిపాలైనప్పటికీ.. ఆ జట్టు కో-ఓనర్ కావ్య మారన్ చేసిన ఒక అద్భుతమైన పని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమె రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుకు చెందిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దగ్గరకు స్వయంగా వెళ్లి అభినందించారు. తన జట్టును ఓడించిన ప్రత్యర్థి ఆటగాడనే కక్ష లేకుండా, ఆ చిన్నారి చూపించిన అసాధారణ ప్రతిభను కావ్య మారన్ మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

బుధవారం జరిగిన అత్యంత ఉత్కంఠభరితమైన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ముప్పతిప్పలు పెడుతూ కేవలం 29 బంతుల్లోనే ఏకంగా 97 పరుగుల సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం మూడు పరుగుల దూరంలో సెంచరీ మిస్ అయినప్పటికీ, అతను ఆడిన ఈ మ్యాచ్ విన్నింగ్ నాక్ రాజస్థాన్ రాయల్స్ జట్టును క్వాలిఫైయర్ రేసులోకి తీసుకెళ్లింది. ఈ చిన్నారి విధ్వంసానికి ఎస్‌ఆర్‌హెచ్ క్యాంప్ సైతం ఫిదా అయిపోయింది. మ్యాచ్ అనంతరం కావ్య మారన్ వైభవ్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి, వెన్నుతట్టి ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.

ఈ 15 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఈ ఐపీఎల్ సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏకంగా 65 సిక్సర్లు, 55 ఫోర్లతో 680 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లో కొనసాగుతున్నాడు. 242 ఎగ్రెసివ్ స్ట్రైక్ రేట్, 45 యావరేజ్‌తో ఆడుతున్న ఈ వండర్ కిడ్ బ్యాటింగ్‌ను చూసి ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు సైతం నోరెళ్లబెడుతున్నారు.

మ్యాచ్ అనంతరం హైదరాబాద్ అసిస్టెంట్ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించారు. “క్రికెట్ చరిత్రలో ఇంత చిన్న వయసులో ఇలాంటి విలక్షణమైన టాలెంట్‌ను ఎవరూ చూసి ఉండరు. అతను చేస్తున్నది నిజంగా అద్భుతం. 15 ఏళ్ల వయసులోనే ఇలా ఆడుతున్నాడంటే, అతని కెరీర్‌లో ఇంకా 25 ఏళ్ల క్రికెట్ మిగిలి ఉందనే ఆలోచనే బౌలర్లకు భయం కలిగిస్తోంది. రోజురోజుకూ అతను మరింత బలంగా, పరిణతి చెందిన ఆటగాడిగా మారతాడు” అని ఫ్రాంక్లిన్ కొనియాడారు.

వైభవ్‌ను అవుట్ చేయడానికి తాము వేసిన ప్లాన్స్ ఏవీ వర్కవుట్ కాలేదని జేమ్స్ ఫ్రాంక్లిన్ అంగీకరించారు. పవర్‌ప్లేలో లెగ్ స్టంప్‌కు లోపలగా ఫుల్ లెంగ్త్ బంతులు వేసి అతని స్వింగ్‌ను అడ్డుకోవాలని చూశామని, కానీ వైభవ్ చాలా తెలివిగా ఆ వ్యూహాన్ని కనిపెట్టి బౌలర్లను లైన్ అండ్ లెంగ్త్ మార్చేలా చేశాడని చెప్పారు. బౌలర్లు ఎక్కడ బంతి వేసినా దాన్ని తన బలంగా మార్చుకుని మైదానం వెలుపలికి పంపడం అతనికే చెల్లిందని, ఇది మరొక అద్భుతమైన ఇన్నింగ్స్ అని ఫ్రాంక్లిన్ ముగించారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us