Watch Video : క్రికెట్ చరిత్రలోనే అత్యంత వింత అవుట్.. నితీష్ రాణా అవుటైన తీరు చూసి అంపైర్లే షాక్

Watch Video : ఐపీఎల్ 2026లో నితీష్ రాణా అవుట్ అయిన తీరు క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. హిట్ వికెట్టా లేక క్యాచ్ అవుటా అనే సందేహానికి అంపైర్లు ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు వైరల్ అవుతోంది. సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్ ఫలితం పూర్తిగా మారిపోయింది.

Watch Video : క్రికెట్ చరిత్రలోనే అత్యంత వింత అవుట్.. నితీష్ రాణా అవుటైన తీరు చూసి అంపైర్లే షాక్
Ipl 2026

Updated on: May 06, 2026 | 11:53 AM

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఒక వింత ఘటనకు వేదికైంది. ఢిల్లీ బ్యాటర్ నితీష్ రాణా అవుటైన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. రాణా అవుటైంది క్యాచ్ వల్లేనా లేక హిట్ వికెట్టా? అనే సందేహాలు నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. నూర్ అహ్మద్ వేసిన మూడో బంతిని నితీష్ రాణా స్వీప్ షాట్ ఆడబోయాడు. అయితే బంతి సరిగ్గా కనెక్ట్ అవ్వక బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దగ్గర ఫీల్డర్ చేతికి చిక్కింది. కానీ సరిగ్గా అదే సమయంలో బ్యాటర్ వెనుక ఉన్న స్టంప్స్ పై బెయిల్స్ కింద పడిపోయాయి. ఇది చూసిన నెటిజన్లు రాణా హిట్ వికెట్ అయ్యాడని, ఆ క్యాచ్ చెల్లదని చర్చ మొదలుపెట్టారు.

హిట్ వికెట్ ఎందుకు కాదు?

వీడియోను క్షుణ్ణంగా పరిశీలిస్తే, రాణా బంతిని కొట్టకముందే స్టంప్స్ పై ఒక బెయిల్ కింద పడిపోయింది. క్రికెట్ నిబంధనల ప్రకారం.. బ్యాటర్ షాట్ ఆడే క్రమంలోనో లేదా రన్ తీసే సమయంలోనో తనంతట తానుగా వికెట్లను పడగొడితేనే అది హిట్ వికెట్ అవుతుంది. ఇక్కడ రాణా వికెట్లకు అసలు తగలనే లేదు. కీపర్ సంజు శాంసన్ కూడా వాటిని తాకలేదు. మరి ఆ బెయిల్ పడిపోవడానికి కారణం ఢిల్లీ వాతావరణం.

ఢిల్లీలో గాలి వాన ప్రభావం

మ్యాచ్ ప్రారంభానికి ముందు ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కూడా విపరీతమైన గాలి వీచింది. ఒకానొక దశలో గాలి తీవ్రతకు ఆటను కాసేపు నిలిపివేయాల్సి కూడా వచ్చింది. నితీష్ రాణా షాట్ ఆడే సమయంలో వీచిన బలమైన గాలి కారణంగానే బెయిల్ కింద పడిపోయిందని అంపైర్లు తేల్చారు. అందుకే దానిని హిట్ వికెట్‌గా కాకుండా కేవలం క్యాచ్ అవుట్‌గానే పరిగణించారు.

సంజు శాంసన్ వీరవిహారం

ఈ గందరగోళం మధ్యే ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సునాయాసంగా విజయం సాధించింది. కెప్టెన్ సంజు శాంసన్ 52 బంతుల్లోనే 87 పరుగులతో (7 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సి.ఎస్.కె కేవలం రెండు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us