IPL 2024 68వ మ్యాచ్‌లో భాగంగా శనివారం (మే 18) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ (RCB vs CSK)తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఆర్‌సీబీ సొంత మైదానం ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ప్లేఆఫ్‌కు ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. ఇప్పటికే 3 జట్లు ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాయి. మిగిలిన ఏకైక స్థానం కోసం RCB, CSK పోరాడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్లు ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ వర్షం వచ్చి మ్యాచ్ రద్దు అయితే మాత్రం CSK ప్లే ఆఫ్ కు వెళుతుంది. అదే సమంయలో ఆర్సీబీ లీగ్ నుండి నిష్క్రమిస్తుంది. దీంతో ఆర్సీబీ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఎంత వర్షం వచ్చినా కేవలం 15 నిమిషాల్లోనే మ్యాచ్ ప్రారంభించేలా చిన్నస్వామి మైదానంలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం, రేపు అంటే మే 18 న నగరంలో భారీ వర్షాలు కురిసే సూచన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు 1 పాయింట్ చొప్పున కేటాయిస్తారు. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ కల చెదిరిపోనుంది. అయితే మ్యాచ్ ప్రారంభం లేదా మధ్యలో వర్షం ఆగితే ఓవర్‌లను కుదించి మళ్లీ మ్యాచ్‌ని ప్రారంభిస్తారు. అయితే, అంతకుముందు కొన్ని మ్యాచ్‌లు పూర్తిగా వర్షం పడగా, మరికొన్ని పిచ్, గ్రౌండ్ తడి కారణంగా రద్దయ్యాయి.
అయితే చిన్నస్వామి మైదానంలో ఈ కారణాలతో మ్యాచ్ రద్దు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఎంత వర్షం వచ్చినా కొన్ని నిమిషాల్లోనే మ్యాచ్‌ను ప్రారంభించే లా సబ్ ఎయిర్ సిస్టమ్ ను ఈ మైదానంలో ఏర్పాటుచేశారు. చిన్నస్వామి స్టేడియం డ్రైనేజీ వ్యవస్థను ఈ వీడియోలో చూపించారు. చిన్నస్వామి స్టేడియం డ్రైనేజీ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఎలా ఉందో ఈ వీడియోలో చూడవచ్చు. ఇక్కడ వర్షం ఆగిన కొద్ది నిమిషాల్లోనే భూమి ఎండిపోతుంది. అలాగే పొలంలో పేరుకుపోయిన నీరు కూడా చాలా త్వరగా భూమిలో కలిసిపోతుంది. ‘చిన్నస్వామి స్టేడియం నాణ్యమైన డ్రైనేజీ వ్యవస్థకు ప్రసిద్ధి చెందింది. సబ్-ఎయిర్ సిస్టమ్ కారణంగా, వర్షం ఆగిన తర్వాత కేవలం 15 నిమిషాల్లో మ్యాచ్‌ను ప్రారంభించవచ్చు. ఎంత భారీ వర్షం కురిసినా ఆటకు రంగం సిద్ధం చేసుకోవచ్చు. వాక్యూమ్ పవర్డ్ డ్రైనేజీ సిస్టమ్ ప్రతి నిమిషానికి 10,000 లీటర్ల నీటిని పిచ్ నుండి తొలగిస్తుంది.గత ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించింది. భారీ వర్షం ఉన్నప్పటికీ మ్యాచ్ మొత్తం జరిగింది’ అని నిర్వాహకులు చెబుతున్నారు.
Chinnaswamy Stadium has the best sub-air drainage and aeration system in the world♥️
Let’s hope for the best✌🏻#RCBvCSK #CSKvRCB #RCBvsCSK @RCBTweets pic.twitter.com/cj5h4WIfkf
— Ⓤನೌನ್_ಮಂದಿ💛❤️ (@unknown_trio) May 17, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..