IPL 2023: అడుగు దూరంలో అరుదైన రికార్డ్.. ఐపీఎల్ 2023లో సరికొత్త చరిత్ర.. అదేంటంటే?

|

May 20, 2023 | 6:45 AM

IPL 2023: బెంగళూరు-హైదరాబాద్ మ్యాచ్‌లో, హెన్రిక్ క్లాసెన్ ఈ ఐపీఎల్‌లో 7వ సెంచరీని సాధించాడు. ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో RCB ఆటగాడు విరాట్ కోహ్లీ 8వ సెంచరీని నమోదు చేశాడు.

1 / 11
ఐపీఎల్ 2023లో గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ చారిత్రాత్మక క్షణాలకు సాక్షిగా నిలిచింది. ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. అలాగే ఐపీఎల్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో అత్యధిక సెంచరీల పరంగా గతేడాది ఎడిషన్‌ను సమం చేసింది.

2 / 11
బెంగళూరు-హైదరాబాద్ మ్యాచ్‌లో హెన్రిక్ క్లాసెన్ ఈ ఐపీఎల్‌లో 7వ సెంచరీ సాధించగా, ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్‌సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ 8వ సెంచరీ నమోదు చేశాడు.

3 / 11
గత ఎడిషన్‌లోనూ మొత్తం 8 సెంచరీలు బాదిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎడిషన్‌లో మరిన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నందున మరో సెంచరీ సాధిస్తే ఐపీఎల్ చరిత్రలో ఓ రికార్డు క్రియేట్ అవుతుంది. ఈ ఎడిషన్‌లో సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం.

4 / 11
హ్యారీ బ్రూక్: ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో SRH బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ కేవలం 55 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఐపీఎల్ 2023 టోర్నీలో ఇది తొలి సెంచరీ.

5 / 11
వెంకటేష్ అయ్యర్: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాట్స్‌మెన్ వెంకటేష్ అయ్యర్ 49 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్లతో భారీ సెంచరీ సాధించాడు.

6 / 11
యశస్వీ జైస్వాల్: ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 1000వ మ్యాచ్‌లో యువ బ్యాట్స్‌మెన్ యశస్వీ జైస్వాల్ 62 బంతుల్లో 8 సిక్సర్లు, 16 ఫోర్లతో 124 పరుగులు చేశాడు.

7 / 11
సూర్యకుమార్ యాదవ్: వాంఖడే స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు.

8 / 11
ప్రభ్‌సిమ్రాన్ సింగ్: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ 59వ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ ప్రభసిమ్రాన్ సింగ్ 65 బంతుల్లో 6 భారీ సిక్సర్లు, 10 ఫోర్లతో 103 పరుగులు చేశాడు.

9 / 11
శుభ్‌మన్ గిల్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఐపీఎల్ 62వ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 58 బంతుల్లో 1 సిక్స్, 13 ఫోర్లతో 101 పరుగులు చేశాడు.

10 / 11
హెన్రిక్ క్లాసెన్: హైదరాబాద్‌లో ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కి చెందిన హెన్రిక్ క్లాసెన్ 49 బంతుల్లో 6 సిక్సర్లు, 8 ఫోర్లతో మెరుపు సెంచరీ సాధించాడు.

11 / 11
విరాట్ కోహ్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ 63 బంతుల్లో సెంచరీ సాధించాడు.