IPL Winners List 2023: తొలి సీజన్ నుంచి 16 వరకు.. ఐపీఎల్‌ విజేతలు, రన్నరప్‌ల పూర్తి జాబితా..

|

May 30, 2023 | 12:48 PM

IPL Winners and Runner Up List 2008 to 2023: ప్రపంచంలోనే అత్యంత రిచ్ క్రికెట్ లీగ్ IPL 16వ సీజన్ ముగిసింది. ఈ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. లీగ్ చరిత్రలో ముంబై ఇండియన్స్ తో కలిసి 5సార్లు ట్రోపీని గెలుచుకుంది.

1 / 16
IPL Winners and Runner Up List 2008 to 2023: ప్రపంచంలోనే అత్యంత రిచ్ క్రికెట్ లీగ్ IPL 16వ సీజన్  ముగిసింది. ఈ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో గత 15 సీజన్లలో ఏ జట్టు ఛాంపియన్, రన్నరప్ టైటిల్‌ను గెలుచుకుందో ఇప్పుడు చూద్దాం..

2 / 16
IPL 2022- గుజరాత్ టైటాన్స్: గత సీజన్‌లో, గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి మొదటిసారి IPL టైటిల్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 130 పరుగులు మాత్రమే చేసింది. ఈ సులభమైన లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఐపీఎల్‌ ద్వారా హార్దిక్‌ పాండ్య తొలి ట్రోఫీని కైవసం చేసుకున్నాడు.

3 / 16
IPL 2021-చెన్నై సూపర్ కింగ్స్: IPL 2021లో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్‌గా నిలిచింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్ కే 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఈ భారీ స్కోరును ఛేదించలేకపోయిన కేకేఆర్ 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సీఎస్‌కే 27 పరుగుల తేడాతో గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది.

4 / 16
IPL 2020-ముంబయి ఇండియన్స్: IPL 2020 చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచింది.

5 / 16
ఐపీఎల్ 2019-ముంబై ఇండియన్స్: ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్లో పటిష్టమైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఫైనల్లో చివరి బంతికి 1 పరుగు తేడాతో గెలుపొంది ముంబై ఇండియన్స్‌ చరిత్ర సృష్టించింది.

6 / 16
IPL 2018-చెన్నై సూపర్ కింగ్స్: IPL లో రెండు కంటే ఎక్కువ ట్రోఫీలు గెలుచుకున్న రెండవ జట్టు చెన్నై సూపర్ కింగ్స్. 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించడం ద్వారా CSK ఛాంపియన్‌గా నిలిచింది.

7 / 16
IPL 2017-ముంబయి ఇండియన్స్: IPL 2017 ఫైనల్లో, ముంబై ఇండియన్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.

8 / 16
IPL 2016-సన్‌రైజర్స్ హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం 8 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో SRH తొలిసారిగా ఛాంపియన్‌గా నిలిచింది.

9 / 16
IPL 2015-ముంబై ఇండియన్స్: 2015 ఫైనల్లో, ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌పై 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది.

10 / 16
ఐపీఎల్ 2014-కోల్‌కతా నైట్ రైడర్స్: 2012 ఎడిషన్ ఫైనల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఛేదించింది.

11 / 16
IPL 2013-ముంబై ఇండియన్స్: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ 23 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి టైటిల్‌ను గెలుచుకుంది.

12 / 16
IPL 2012-కోల్‌కతా నైట్ రైడర్స్: చెన్నై సూపర్ కింగ్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా కోల్‌కతా నైట్ రైడర్స్ IPLలో తొలిసారిగా ఛాంపియన్‌గా అవతరించింది.

13 / 16
IPL 2011-చెన్నై సూపర్ కింగ్స్: చెన్నై సూపర్ కింగ్స్ IPL చరిత్రలో బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ గెలిచిన మొదటి జట్టుగా నిలిచింది. ఆర్‌సీబీతో జరిగిన ఫైనల్లో 58 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

14 / 16
IPL 2010-చెన్నై సూపర్ కింగ్స్: 2010 ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 22 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి తొలిసారి టైటిల్‌ను గెలుచుకుంది.

15 / 16
IPL 2009-డెక్కన్ ఛార్జర్స్: IPL 2వ సీజన్ చివరి మ్యాచ్‌లో, డెక్కన్ ఛార్జర్స్ (ప్రస్తుతం SRH) జట్టు RCB జట్టును 6 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.

16 / 16
IPL 2008-రాజస్థాన్ రాయల్స్: IPL మొదటి సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 163 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ చివరి బంతికి విజయం సాధించి ఉత్కంఠభరితమైన విజయాన్ని అందుకోవడం ద్వారా తొలి ఛాంపియన్‌గా అవతరించింది.