IND vs SA: సౌతాఫ్రికా గుండెల్లో గుబులు పెంచేసిన స్నేహ్ రానా.. ఏకంగా 8 వికెట్లతో..

Sneh Rana: భారత్-దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతోంది, ఈ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించిన భారత మహిళలు ఇప్పుడు మ్యాచ్‌పై పట్టు సాధించారు. కాబట్టి ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచే అవకాశం ఉంది.

IND vs SA: సౌతాఫ్రికా గుండెల్లో గుబులు పెంచేసిన స్నేహ్ రానా.. ఏకంగా 8 వికెట్లతో..
Indw Vs Saw Sneh Rana
Follow us

|

Updated on: Jul 01, 2024 | 11:57 AM

India Women vs South Africa Women, One-off Test: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ స్నేహ రాణా అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఏకంగా 8 వికెట్లు పడగొట్టి, సౌతాఫ్రికా ప్లేయర్లను వణించేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా స్మృతి మంధాన (149) సెంచరీ చేయగా, షఫాలీ వర్మ (205) డబుల్ సెంచరీతో రాణించింది.

హర్మన్‌ప్రీత్ కౌర్ 69 పరుగులు చేయగా, జెమీమా రోడ్రిగ్స్ 55 పరుగులు చేసింది. అలాగే రిచా ఘోష్ 90 బంతుల్లో 86 పరుగులు చేసింది. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ప్రపంచ రికార్డు 603 పరుగులకు డిక్లేర్ చేసింది.

అనంతరం తొలి ఇన్నింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా తరపున సునే లూస్ (65), మరిజాన్నె కాప్ (74) అర్ధ సెంచరీలతో మెరిశారు. కానీ, స్నేహ రానా స్పిన్‌ ఆకర్షణ కారణంగా మిగతా బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. ఫలితంగా దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది.

టీమిండియా తరపున అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శించిన స్నేహ రానా 77 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టగా, దీప్తి శర్మ 2 వికెట్లు తీశారు.

సెకండ్ ఇన్నింగ్స్:

తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు 266 పరుగులకు ఆలౌట్ కావడంతో ఫాలోఆన్ పొంది రెండో ఇన్నింగ్స్‌కు ఆహ్వానించారు. అందుకు తగ్గట్టుగానే 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా మహిళలు ధీటైన పోరాటాన్ని ప్రదర్శించారు.

జట్టులో సునే లూస్ (109) సెంచరీ చేయగా, కెప్టెన్ లారా వోల్వార్డ్ 122 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఈ అద్భుతమైన బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికా జట్టు నాలుగో రోజు లంచ్ సమయానికి 5 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. కాగా, ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు 35 పరుగుల వెనుకంజలో ఉంది.

ఇరు జట్లు..

భారత్ ప్లేయింగ్ 11: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, శుభా సతీష్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, రేణుకా ఠాకూర్ సింగ్, రాజేశ్వరి గైక్వాడ్.

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11: లారా వోల్‌వార్డ్ట్ (కెప్టెన్), సునే లూస్, అన్నెకే బాష్, మరిజాన్నె కాప్, డెల్మీ టక్కర్, నాడిన్ డి క్లెర్క్, అన్నేరీ డెర్క్‌సెన్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), మసాబటా క్లాస్, నంకులులెకో మ్లాబా, తుమీ సెఖుఖునే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సీఎంల భేటీపై సర్వత్రా ఉత్కంఠ.. పెండింగ్‌‌లో ఉన్న అంశాలు ఇవే..
సీఎంల భేటీపై సర్వత్రా ఉత్కంఠ.. పెండింగ్‌‌లో ఉన్న అంశాలు ఇవే..
జగన్నాథబలరామసుభద్రల విగ్రహాలు ప్రతి 12ఏళ్లకు ఎందుకు మారుస్తారంటే
జగన్నాథబలరామసుభద్రల విగ్రహాలు ప్రతి 12ఏళ్లకు ఎందుకు మారుస్తారంటే
రణవీర్ సింగ్ సినిమా పక్కన పెట్టేసిన శంకర్.. కారణం ఇదేనా..
రణవీర్ సింగ్ సినిమా పక్కన పెట్టేసిన శంకర్.. కారణం ఇదేనా..
ఇది రెబల్ స్టార్ రేంజ్..! అక్కడ టాప్ 10ల్లో ఆరు ప్రభాస్ సినిమాలే.
ఇది రెబల్ స్టార్ రేంజ్..! అక్కడ టాప్ 10ల్లో ఆరు ప్రభాస్ సినిమాలే.
BNS చట్టం అమల్లోకి వచ్చిన రెండో రోజే MLAపై కేసు
BNS చట్టం అమల్లోకి వచ్చిన రెండో రోజే MLAపై కేసు
వీధికుక్కల బీభత్సం.. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై దాడి..
వీధికుక్కల బీభత్సం.. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై దాడి..
ఆ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఇసుక కొరత.. ఎక్కడంటే..
ఆ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఇసుక కొరత.. ఎక్కడంటే..
కేరళ కళాకారుడి చేతిలో ప్రధాని మోదీ అద్భుతమైన విగ్రహం..ఎత్తు, రూపు
కేరళ కళాకారుడి చేతిలో ప్రధాని మోదీ అద్భుతమైన విగ్రహం..ఎత్తు, రూపు
ఓటీటీ డీల్ సెట్ అయితే తప్ప నో రిలీజ్.. ఆ హీరోలకి డిజిటల్ కష్టాలు
ఓటీటీ డీల్ సెట్ అయితే తప్ప నో రిలీజ్.. ఆ హీరోలకి డిజిటల్ కష్టాలు
పోలీసులను చూసి లారీ వదిలేసి పరార్.. వాహనంలో ఏముందా అని చూడగా
పోలీసులను చూసి లారీ వదిలేసి పరార్.. వాహనంలో ఏముందా అని చూడగా