ఆ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఇసుక కొరత.. కొత్తపాలసీపై ఎదురుచూపులు..

గుంటూరు జిల్లాలో ఇసుక కొరత ఏర్పడింది. కొత్త ఇసుక పాలసీని ప్రభుత్వం ప్రకటించకపోవడంతో ఇసుక తవ్వకాలు ఆగిపోయాయి. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఇసుక పాలసీ వివాదాస్పదమైంది. దీంతో కొత్త ప్రభుత్వం వినియోగదారులకు మేలు జరిగేలా కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే గత నెల రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా ఉన్న రీచ్ ల్లో తవ్వకాలు ఆగిపోవడంతో ఇసుకకు డిమాండ్ పెరిగింది. గుంటూరు జిల్లాలో ఇసుక కొరత ప్రారంభమైంది. ఇసుక లభ్యత లేకపోవటంతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఆ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఇసుక కొరత.. కొత్తపాలసీపై ఎదురుచూపులు..
New Sand Policy
Follow us

| Edited By: Srikar T

Updated on: Jul 03, 2024 | 9:27 AM

గుంటూరు జిల్లాలో ఇసుక కొరత ఏర్పడింది. కొత్త ఇసుక పాలసీని ప్రభుత్వం ప్రకటించకపోవడంతో ఇసుక తవ్వకాలు ఆగిపోయాయి. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఇసుక పాలసీ వివాదాస్పదమైంది. దీంతో కొత్త ప్రభుత్వం వినియోగదారులకు మేలు జరిగేలా కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే గత నెల రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా ఉన్న రీచ్ ల్లో తవ్వకాలు ఆగిపోవడంతో ఇసుకకు డిమాండ్ పెరిగింది. గుంటూరు జిల్లాలో ఇసుక కొరత ప్రారంభమైంది. ఇసుక లభ్యత లేకపోవటంతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిచిపోతున్నాయి. నిర్మాణ రంగ కార్మికులు కూడా త్వరగా ఇసుక పాలసీని కొత్త ప్రభుత్వం ప్రకటించాలంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 56 ఇసుక రీచ్ లున్నాయి. వీటిల్లో 20 రీచ్‎లకు పర్యావరణ అనుమతులు లేవు. అనుమతులున్నా 36 రీచ్‎ల్లో కూడా ప్రస్తుతం ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇసుక రవాణా ఆగిపోయింది. గత ప్రభుత్వంలో ఇసుక పాలసీపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. మాజీ ఎమ్మెల్యేలు సైతం శాండ్ పాలసీని వ్యతిరేకించారు.

గత ప్రభుత్వం హయాంలో గుంటూరు జిల్లాలో లారీ ఇసుక ముప్పై వేల రూపాయల నుండి నలభై వేల రూపాయలకు చేరింది. ఇసుక తవ్వకాలన్నీ కూడా జేపి సంస్థే చేసింది. దీంతో జిల్లాలో ఎప్పుడూ లేనంతగా ఇసుక ధరలు ఆకాశాన్ని అంటాయి. కరోనాతో పాటు ఇసుక కూడా లేకపోవడంతో నిర్మాణ రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం పాలసీలో ఎటువంటి మార్పులు చేయలేదు. దీంతో మొత్తంగా గత ప్రభుత్వంలో నిర్మాణ రంగం కుదేలైంది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో కూటమి నేతలు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక పాలసీని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇంకా కొత్త పాలసీని ప్రకటించలేదు. పాత పాలసీలో తవ్వకాలను నిలిపి వేశారు. దీంతో నిర్మాణ రంగంలో సమస్యలు మొదలయ్యాయి. మరోవైపు వర్షాలు ప్రారంభమవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే కొత్త పాలసీ ప్రకటించకపోతే నదుల్లోకి నీరు వచ్చి తవ్వకాలు జరపలేని పరిస్థితి నెలకొంటుంది. దీంతో మరో రెండు మూడు నెలల పాటు ఇసుకకు తీవ్ర కొరత ఏర్పడుతుంది. ఇదే జరిగితే నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కార్మికులు అంటున్నారు. 2019 సమయంలో కూడా అప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం కొత్త పాలసీ ప్రకటించడంలో జాప్యం కారణంగా తీవ్ర సమస్య వచ్చింది. దీనికి తోడు కరోనా కూడా జత కావడంతో నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు మరింత జఠిలమయ్యాయి. ఇప్పటికైనా ఎన్డీయే ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని ప్రకటించి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు కార్మికులు, స్థానికులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..