TV9 Telugu
01 July 2024
టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా ట్రోఫీ కోసం 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు టీమిండియా తెరపడింది.
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి రెండోసారి ఈ ట్రోఫీని గెలుచుకుంది.
టీమ్ ఇండియా సాధించిన ఈ చిరస్మరణీయ విజయం యావత్ దేశం ఆనందంలో నిండగా, ఆటగాళ్ల ఖాతాల్లోనూ రివార్డుల వర్షం కురిసింది.
ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, టీమ్ ఇండియా ఐసీసీ నుంచి ట్రోఫీ, పతకంతోపాటు దాదాపు రూ. 22.76 కోట్లను రివార్డ్‌గా అందుకుంది.
అదే సమయంలో, టీమిండియా సాధించిన ఈ చిరస్మరణీయ విజయంపై ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ తన ఖజానాను పూర్తిగా తెరిచింది.
విజయం సాధించిన ఒక రోజు తర్వాత, టీమ్ ఇండియా, దాని సహాయక సిబ్బందికి 125 కోట్ల రూపాయల రివార్డు ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా ప్రకటించారు.
ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినందుకు క్రికెట్ చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఏ బోర్డు కూడా తమ జట్టుకు ఇంత పెద్ద పారితోషికం ఇవ్వలేదు.
అయితే, ఛాంపియన్ టీం స్వదేశానికి తిరిగి రావడంలో జాప్యం ఏర్పడింది. బార్బోడాస్‌లో తుఫాన్ కారణంగా, విమానాశ్రయం మూసేశారు.