Jasprit Bumrah-Sanjana Ganesan: జస్ప్రీత్ బుమ్రా-సంజన దంపతులకు మగబిడ్డ.. పేరేంటో తెలుసా?

|

Sep 04, 2023 | 3:19 PM

Jasprit Bumrah: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, అతని భార్య సంజనా గణేషన్ మగబిడ్డకు స్వాగతం పలికారు. ఈ విషయాన్ని బుమ్రా స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. ఆసియా కప్‌లో టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని నిర్వహిస్తున్న యార్కర్ కింగ్ బుమ్రా.. సెప్టెంబర్ 3న హఠాత్తుగా భారత జట్టును వీడి ముంబైకి చేరుకున్నాడు.

Jasprit Bumrah-Sanjana Ganesan: జస్ప్రీత్ బుమ్రా-సంజన దంపతులకు మగబిడ్డ.. పేరేంటో తెలుసా?
Jasprit Bumrah
Follow us on

Jasprit Bumrah – Sanjana Ganesan: టీమిండియా స్పీడ్‌స్టర్‌ జస్ప్రీత్ బుమ్రా, అతని భార్య సంజనా గణేశన్‌లు మగబిడ్డకు స్వాగతం పలికారు. ఈ విషయాన్ని బుమ్రా స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. ఆసియా కప్ (Asia Cup 2023)లో టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని చేపట్టిన టీమిండియా యార్కర్ కింగ్ బుమ్రా.. నిన్న అంటే సెప్టెంబర్ 3న అకస్మాత్తుగా టీమ్ ఇండియాను విడిచిపెట్టి ముంబైకి తిరిగి వచ్చాడు. టీమ్‌కి ట్రంప్‌ కార్డ్‌గా ఉన్న బుమ్రా హఠాత్తుగా టీమిండియా నుంచి వైదొలగడంతో అభిమానుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే జాతీయ మీడియా నివేదికల ప్రకారం, బుమ్రా దంపతులు తమ మొదటి బిడ్డకు ఆహ్వానం పలికేందుకే బుమ్రా జట్టును విడిచిపెట్టి దేశానికి తిరిగి వచ్చాడని తెలిపాయి.

బాబు పేరు ఏంటంటే?

ఈ రోజు తెల్లవారుజామున మా ఇంటికి ఒక చిన్న అతిథి రాక గురించి సంతోషకరమైన వార్తను మీతో పంచుకుంటున్నాను అంటూ బుమ్రా తన ట్విట్టర్ ఖాతా రాసుకొచ్చాడు. మా ఇంటిలో కొత్త సభ్యుడితో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు తాము ఉత్సాహంగా ఉన్నామని రాసుకొచ్చాడు. అదే పోస్ట్‌లో బుమ్రా తన కొడుకు పేరును కూడా వెల్లడించాడు. బిడ్డకు ‘అంగద్ జస్ప్రీత్ బుమ్రా’ అని పేరు పెట్టినట్లు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

టీమ్‌లోకి రీ ఎంట్రీ ఎప్పుడు?

ఇదిలా ఉంటే.. తొలి బిడ్డతో ఆనందంలో ఉన్న బుమ్రా స్థానంలో మహ్మద్ షమీ నేపాల్‌తో ప్లేయింగ్ 11లోకి ఎంట్రీ ఇచ్చాడు. కాగా, బుమ్రా మళ్లీ ఎప్పుడు జట్టులోకి వస్తాడోనని అంతా వేచి చూస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 10 ఆదివారం పాకిస్థాన్‌తో జరుగుతున్న సూపర్ ఫోర్ మ్యాచ్‌లో బుమ్రా జట్టులో చేరనున్నట్లు తెలుస్తోంది.

ట్వీట్ చేసిన బుమ్రా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..