IND vs NEP, Playing XI: బుమ్రా స్థానంలో ఎంట్రీ ఇచ్చిన షమీ.. నేపాల్‌తో టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..

|

Sep 04, 2023 | 2:52 PM

India vs Nepal: సూపర్ ఫోర్‌కి ముందు గ్రూప్-ఏలో ఇదే చివరి మ్యాచ్. అంతకుముందు పాకిస్థాన్‌తో భారత్ ఆడాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కాగా, నేపాల్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో 238 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నేపాల్‌ సూపర్‌ ఫోర్‌కి వెళ్లాలంటే భారత్‌ను ఓడించడం తప్పనిసరి. అదే సమయంలో, వర్షం కారణంగా ఇక్కడ కూడా మ్యాచ్ రద్దు అయితే, రోహిత్ సేన సూపర్ ఫోర్‌కి వెళుతుంది.

IND vs NEP, Playing XI: బుమ్రా స్థానంలో ఎంట్రీ ఇచ్చిన షమీ.. నేపాల్‌తో టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
Team India Playin 11
Follow us on

ఆసియా కప్ 2023లో భారత్ రెండో మ్యాచ్ ఆడుతోంది. ఈసారి పోటీ నేపాల్‌ టీంతో. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్, నేపాల్ జట్ల మధ్య ఇదే తొలి ఎన్‌కౌంటర్. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రోహిత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో నేపాట్ టీం ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

సూపర్ ఫోర్‌కి ముందు గ్రూప్-ఏలో ఇదే చివరి మ్యాచ్. అంతకుముందు పాకిస్థాన్‌తో భారత్ ఆడాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కాగా, నేపాల్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో 238 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నేపాల్‌ సూపర్‌ ఫోర్‌కి వెళ్లాలంటే భారత్‌ను ఓడించడం తప్పనిసరి. అదే సమయంలో, వర్షం కారణంగా ఇక్కడ కూడా మ్యాచ్ రద్దు అయితే, రోహిత్ సేన సూపర్ ఫోర్‌కి వెళుతుంది. ఎందుకంటే ఇప్పటికే భారత్ ఖాతాలో 1 పాయింట్ ఉంది. నేపాల్ ఖాతాలో ఒక్క పాయింట్ కూడా లేదు.

ఇవి కూడా చదవండి

భారత్-నేపాల్ మ్యాచ్ పిచ్ ఎలా ఉంది?

భారత్-నేపాల్ మ్యాచ్‌ ఇంతకుముందు ఆడిన పిచ్‌పైనే జరగనుంది. ఈ పిచ్‌పై భారత్‌, పాకిస్థాన్‌లు తలపడ్డాయి. పిచ్ ఫ్లాట్‌గా ఉంది. అయితే, దీనిపై ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లకు సహాయం అందనుంది.

ఇరుజట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

నేపాల్ (ప్లేయింగ్ XI): కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్(కీపర్), రోహిత్ పౌడెల్(కెప్టెన్), భీమ్ షర్కి, సోంపాల్ కమీ, గుల్సన్ ఝా, దీపేంద్ర సింగ్ ఐరీ, కుశాల్ మల్లా, సందీప్ లామిచానే, కరణ్ కేసీ, లలిత్ రాజ్‌బన్షి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..