Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు మరో బ్యాడ్ న్యూస్.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన తెలుగబ్బాయ్

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురించిన వార్తల ప్రకారం, టీమిండియా మేనేజ్‌మెంట్ అతన్ని వన్డే క్రికెట్‌కు దూరంగా ఉంచింది. శ్రీలంక టూర్‌లో భారత టీ20 టీమ్‌లో చోటు దక్కించుకున్నా వన్డే జట్టులోకి రాలేకపోయాడు. ఆ తరువాత, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా వన్డే సెటప్‌లో హార్దిక్ పాండ్యా పేరును చేర్చలేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు మరో బ్యాడ్ న్యూస్.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన తెలుగబ్బాయ్
Gautam Gambhir Hardik Pandya
Follow us

|

Updated on: Jul 20, 2024 | 2:16 PM

Hardik Pandya: రోహిత్ శర్మ కెప్టెన్సీలో ICC T20 వరల్డ్ కప్ 2024 గెలిచిన హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం చాలా బ్యాడ్ టైమ్‌లో ఉన్నాడు. తాజాగా శ్రీలంక టూర్‌కు టీ20 టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఎంపిక కాలేదు. దీంతోపాటు హార్దిక్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు మరో బ్యాడ్ న్యూస్ వచ్చింది. దీని కారణంగా అతని వన్డే కెరీర్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

హార్దిక్ పాండ్యా మెడపై వేలాడుతోన్న కత్తి..

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురించిన వార్తల ప్రకారం, టీమిండియా మేనేజ్‌మెంట్ అతన్ని వన్డే క్రికెట్‌కు దూరంగా ఉంచింది. శ్రీలంక టూర్‌లో భారత టీ20 టీమ్‌లో చోటు దక్కించుకున్నా వన్డే జట్టులోకి రాలేకపోయాడు. ఆ తరువాత, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా వన్డే సెటప్‌లో హార్దిక్ పాండ్యా పేరును చేర్చలేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందులో చోటు దక్కించుకోవాలంటే దేశవాళీ లిస్ట్-ఏ క్రికెట్ ఆడి తానేంటో నిరూపించుకోవాల్సి ఉంటుంది. అతను నిరంతరం 10-10 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆల్ రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని భారత మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఎందుకంటే ఐసీసీ టోర్నీ ఆసియా దేశంలో జరగాల్సి ఉంది.

హార్దిక్ స్థానంలో ఎవరికి అవకాశం?

తన ఫాస్ట్ బౌలింగ్, బ్యాటింగ్‌తో సందడి చేసిన నితీష్ రెడ్డిని సిద్ధం చేయాలని టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ కూడా కోరుకుంటోందని నివేదికలో తెలిపింది. 21 ఏళ్ల నితీష్ ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు.

శ్రీలంక పర్యటనకు భారత్..

ఇక టీమిండియా శ్రీలంక టూర్ గురించి మాట్లాడుకుంటే.. జులై 27న జరిగే తొలి టీ20 మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా శ్రీలంక పర్యటనలో మూడు మ్యాచ్‌ల తొలి టీ20 సిరీస్‌ను ఆడనుంది. కాగా, దీని తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ను కూడా ఆడనుంది. ఈ సిరీస్‌తో కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పదవీకాలం కూడా ప్రారంభమవుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పాత చీర పట్టుకెళ్తే.. నచ్చిన చేపను పట్టుకోవచ్చు...
పాత చీర పట్టుకెళ్తే.. నచ్చిన చేపను పట్టుకోవచ్చు...
పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!
పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!
రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత
రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్
బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్
హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?
హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?
హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా
హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా
ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం
ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం
క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?
క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా?
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా?