SIIMA Awards: సైమాకు నామినేట్ అయిన ‘పిండం’.. ఏ విభాగంలో అంటే..

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సైమా అవార్డులకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్‌ 14,15 తేదీల్లో దుబాయ్‌ వేదికగా ఈ వేడుక జరగనుంది. దీంతో ఇప్పటికే ఈ అవార్డులు దక్కించుకునేందుకు పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ‘సైమా’ టీమ్‌ తాజాగా విడుదల చేసింది. ఇందులో భాగంగా ఓ చిన్న సినిమా నామినేట్ కావడం విశేషం. ఆ సినిమా మరేదో కాదు పిండం...

SIIMA Awards: సైమాకు నామినేట్ అయిన 'పిండం'.. ఏ విభాగంలో అంటే..
Pindam Movie
Follow us

|

Updated on: Jul 20, 2024 | 2:29 PM

సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులో సైమా ఒకటి. సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ పేరుతో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన టెక్నీషియన్స్‌ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ అవార్డులను ప్రారంభించిన విషయం తెలిసిందే. 12 ఏళ్లుగా విజయవంతంగా ఈ పురస్కారాల వేడుకలు జరుగుతున్నాయి. ఈ అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తుంటారు.

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సైమా అవార్డులకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్‌ 14,15 తేదీల్లో దుబాయ్‌ వేదికగా ఈ వేడుక జరగనుంది. దీంతో ఇప్పటికే ఈ అవార్డులు దక్కించుకునేందుకు పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ‘సైమా’ టీమ్‌ తాజాగా విడుదల చేసింది. ఇందులో భాగంగా ఓ చిన్న సినిమా నామినేట్ కావడం విశేషం. ఆ సినిమా మరేదో కాదు పిండం. 2023 డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను తెగ భయపెట్టేసిందని చెప్పాలి. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ పిండం మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన ఈ హారర్‌ చిత్రానికి సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సైమా అవార్డుల్లో ఉత్తమ తొలి చిత్ర నిర్మాత విభాగంలో నామినేషన్ పొందింది. బెస్ట్‌ డెబ్యూ ప్రొడ్యూసర్‌ విభాగంలో ఈ సినిమా ఎంపికైనట్లు సైమా తెలిపింది. దీనిపై పిండం చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. సైమాకు సినిమా ఎంపిక కావడంపై మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి యశ్వంత్ దగ్గుమాటి నిర్మాణ బాధ్యతలు వహించిన విషయం తెలిసిందే.

సినిమాల్లోకి రాకముందు యశ్వంత్‌ దగ్గుబాటి అమెరికాలోని కార్పొరేట్ రంగంలో పేరు తెచ్చుకున్నారు. అక్కడే దర్శకుడు సాయికిరణ్‌ను కలిసిన యశ్వంత్.. పిండం సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ సినిమా తీసే సమయంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కొని చిత్రాన్ని పూర్తి చేసినట్లు నిర్మాత చెప్పుకొచ్చారు. మరి పిండం చిత్రానికి ఈ అవార్డు లభిస్తుందో లేదో చూడాలి.

ఇదిలా ఉంటే పిండంతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన దర్‌శకుడు సాయి కిరణ్ మరో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కళాహి మీడియా ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌ పైకి తీసుకెళ్లే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి…

సైమాకు నామినేట్ అయిన 'పిండం'.. ఏ విభాగంలో అంటే..
సైమాకు నామినేట్ అయిన 'పిండం'.. ఏ విభాగంలో అంటే..
మొదటి సినిమాతోనే సంచలనం.. తెలుగు అత్యధిక రెమ్యునరేషన్.. కానీ..
మొదటి సినిమాతోనే సంచలనం.. తెలుగు అత్యధిక రెమ్యునరేషన్.. కానీ..
కమ్మ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
కమ్మ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
సినిమా మీద ఇష్టంతో ప్రేమను వదులు కోవాల్సి వచ్చింది. కార్తీక్‌
సినిమా మీద ఇష్టంతో ప్రేమను వదులు కోవాల్సి వచ్చింది. కార్తీక్‌
ముందుగానే జాగ్రత్త పడిన హార్దిక్ .. ఆస్తులన్నీ ఆమె పేరు మీదనే
ముందుగానే జాగ్రత్త పడిన హార్దిక్ .. ఆస్తులన్నీ ఆమె పేరు మీదనే
మహిళతో సీఐ అసభ్య చాటింగ్‌.. వేటు వేసిన సీపీ
మహిళతో సీఐ అసభ్య చాటింగ్‌.. వేటు వేసిన సీపీ
మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. దీని ప్రత్యేకతలు ఏంటంటే..
మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. దీని ప్రత్యేకతలు ఏంటంటే..
క్లాస్‌రూంలో విద్యార్థులంతా భోజనం చేస్తున్నారు.. రెప్పపాటులో..
క్లాస్‌రూంలో విద్యార్థులంతా భోజనం చేస్తున్నారు.. రెప్పపాటులో..
మరో 2 రోజులే దంచుడే... ఇదిగో ఏపీ వెదర్ రిపోర్ట్
మరో 2 రోజులే దంచుడే... ఇదిగో ఏపీ వెదర్ రిపోర్ట్
పవన్ కల్యాణ్, చిరంజీవిల మధ్య ఉన్న ఈ పోలీసమ్మను గుర్తు పట్టారా?
పవన్ కల్యాణ్, చిరంజీవిల మధ్య ఉన్న ఈ పోలీసమ్మను గుర్తు పట్టారా?
పాత చీర పట్టుకెళ్తే.. నచ్చిన చేపను పట్టుకోవచ్చు...
పాత చీర పట్టుకెళ్తే.. నచ్చిన చేపను పట్టుకోవచ్చు...
పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!
పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!
రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత
రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్
బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్
హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?
హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?
హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా
హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా
ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం
ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం
క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?
క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా?
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా?