సిగ్గు శరం లేని వాడినని నేను ఏమి దిగులు పడను.! జగపతి బాబు కామెంట్స్
Anil Kumar
20 July 2024
అందరి ట్వీట్లు ఒకెత్తైతే.. ఆర్జీవీ ట్వీట్లు మరొక ఎత్తు అనే కామెంట్ నెట్టింట ఉండేది నిన్నమొన్నటి వరకు.
కానీ ఈ కామెంట్‌ను.. తన ఫన్నీ అండ్ ఫ్రాంక్‌నెస్ ట్వీట్లతో తన వైపు మళ్లించుకున్నారు చార్మింగ్ జగపతి బాబు.
రీసెంట్ డేస్లో చిత్ర విచిత్రమైన ట్వీట్లకు కేరాఫ్‌గా మారిన ఈ స్టార్.. ఇప్పుడు అలాంటి ట్వీట్ ఒకటి చేశారు.
తను క్యాసినోలో తీసుకున్న ఫోటో ఒకటి తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన జగపతి బాబు.. దానికి రిలేటెడ్ గా
సిగ్గు శరం లేని వాడినని దిగులు పడను..కానీ., మీరు చెబితే పడతాను అంటూ ఆ ఫోటో కు క్యాప్షన్‌గా రాసుకొచ్చారు.
తన ట్వీట్‌తో.. ఆ ట్వీట్‌లోని తన రాతతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ హాట్ టాపిక్ గా నిలిచారు ఈ స్టార్.
అయితే జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తరువాత వరస అవకాశాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు ఈయన.
స్టైలిష్ లుక్స్ తో ఎవర్ గ్రీన్ అంటూ కామెంట్స్ తో పాటు తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు జగపతి బాబు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి