మల్టి టాలెంటెడ్ శృతి హాసన్.. ఇకపై అలా కూడా మెప్పిస్తుందా.!
Anil Kumar
20 July 2024
టాలీవుడ్ లో హీరోయిన్ శ్రుతిహాసన్ తెలియని వాళ్ళు ఉంటారా చెప్పండి.. పైగా ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు.
అయితే శ్రుతిహాసన్‌లో యాక్టర్ మాత్రమే కాదు.. అద్భుతమైన సింగర్ కూడా ఉన్న విషయం తాజాగా అందరికి తెలిసిందే.
అంతేకాదు గతంలో కూడా పాటలు పాడిన శృతి.. తానే స్వయంగా పాటలు రాసి కంపోజ్ చేసి మెప్పిస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.
తనలోని ఈ కోణాలన్నింటినీ ఇదివరుకే చూపించింది శ్రుతి. మొన్న ఈ మధ్య కూడా స్టేజ్ పెరఫార్మెన్స్ ఇచ్చింది.
తమిళ్ హీరో కం యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా మిస్కిన్ డైరక్షన్‌లో తెరకెక్కుతున్న తాజా సినిమా ట్రైన్.
ఈ సినిమాకు డైరెక్టర్ మిస్కిన్ నే సంగీతం కూడా అందిస్తున్నారు. ట్రైన్ సినిమాలో మొత్తం నాలుగు పాటలుంటాయి.
అందులో ఓ పాటను హీరోయిన్ శ్రుతిహాసన్ పాడారు. ట్రైన్ మూవీ థీమ్ నచ్చి, యూనిట్‌తో జర్నీ చేస్తున్నారు శ్రుతి.
ఇదిలా ఉంటె శృతి హాసన్ నెట్టింట యాక్టీవ్.. అందాలకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే సంపాదించుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి