హార్దిక్ కాదు, గిల్‌కి నోఛాన్స్.. 2026 వరకు భారత టీ20 కెప్టెన్‌గా అతనే

Venkata Chari

16 July 2024

శ్రీలంక పర్యటన నుంచి టీ20 ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు కొత్త శాశ్వత కెప్టెన్‌ను పొందవచ్చు. లిస్టులో ముగ్గురు పోటీదారులు ఉన్నారు.

అయితే హార్దిక్ పాండ్యాకు ఈ బాధ్యత దక్కదని తెలుస్తోంది. ఇప్పటికే లంకతో వన్డేలకు దూరంగా ఉంటానని హార్దిక్ చెప్పాడు.

ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ ఆల్ రౌండర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను భారత T20 జట్టుకు కెప్టెన్‌గా చేయవచ్చు. 

2026లో జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకు అతనికి ఈ బాధ్యతలు ఉంటాయని భావిస్తున్నారు. ఫ్యూచర్‌ని పరిగణలోకి తీసుకుంటే, సూర్యనే బెస్ట్ ఆఫ్షన్ అని తెలుస్తోంది.

2024లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్‌ భారత్‌కు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

అంతకుముందు, 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత అతను జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.

ఇటువంటి పరిస్థితిలో, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత, హార్దిక్‌ను కొత్త కెప్టెన్‌గా పరిగణించారు. కానీ, పరిస్థితులు మారినట్లు తెలుస్తోంది.

కానీ ఇప్పుడు అతను వెనుకబడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అతని ఫిట్ నెస్‌ను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.