Veda Krishnamurthy: భారత క్రికెటర్ వేదా కృష్ణమూర్తి కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉంటుంది. అయితే, ఇప్పుడు ఆమె తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది. ఈ స్టార్ మహిళా ప్లేయర్ త్వరలో పెళ్లికూతురు కాబోతోంది. ఈ విషయాన్ని వేద స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
వేదా తన బాయ్‌ఫ్రెండ్, కాబోయే భర్త అర్జున్ హొయసాలతో కలిసి కనిపించిన కొన్ని ఫొటోలను నెట్టింట్లో పంచుకుంది. ఈ చిత్రాలు కాశ్మీర్‌కు చెందినవి. అర్జున్ మోకాళ్లపై కూర్చుని చాలా రొమాంటిక్‌గా వేదాకు ప్రపోజ్ చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి.