వరల్డ్ కప్‌లో టీమిండియా సత్తా చాటుతోంది. వరస విజయాలతో మంచి ఊపు మీద ఉంది. ఆదివారం పాక్‌తో జరిగిన కీలక పోరులో 89 పరుగుల తేడాతో కోహ్లీ సేన విజయకేతనం ఎగరేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్…ఇలా మూడు అంశాల్లోనూ పాకిస్థాన్‌పై స్పష్టమైన ఆధిక్యాన్ని చాటుకుంది భారత్. భారత జట్టు సక్సస్‌కు కారణమేంటో పాక్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది విశ్లేషించారు. ప్రపంచ క్రికెట్‌లో భారత జట్టు బలమైన జట్టుగా ఆవిర్భవించడానికి ఐపీఎల్ ప్రధాన కారణంగా చెప్పుకొచ్చాడు
యువ ఆటగాళ్లలో నైపుణ్యాన్ని గుర్తించడంతో పాటు వారు ఒత్తిడిని జయించే నైపుణ్యాన్ని ఐపీఎల్ నేర్పుతోందని అఫ్రిది అన్నాడు. ఐపీఎల్ కారణంగా భారత్ క్రికెట్‌లో నాణ్యత, ఆటగాళ్ల నైపుణ్యత బాగా పెరిగిందని వివరించారు. పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన సందర్భంగా బీసీసీఐకి అభినందనలు తెలిపాడు.
Congratulations to @BCCI on a well deserved win today. The standard of cricket being played has been exceptionally high & credit goes to IPL for not only helping identify & harness talent, but also in equipping younger players with pressure handling techniques #CWC19 #PAKVIND https://t.co/MfiwQxwjrK
— Shahid Afridi (@SAfridiOfficial) June 16, 2019