India vs Bangladesh, 1st Test Day 2: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 376 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ రెండో రోజైన శుక్రవారం 339/6 స్కోరుతో ఆట ప్రారంభించిన టీమిండియా 37 పరుగులకే చివరి 4 వికెట్లు కోల్పోయింది. వీరిలో తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు.
తొలిరోజు సెంచరీ చేసిన రవిచంద్రన్ అశ్విన్ 113 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా 86 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈరోజు అతను పరుగులు చేయలేకపోయాడు. ఆకాశ్ దీప్ 17 పరుగులు, జస్ప్రీత్ బుమ్రా 7 పరుగులు చేశారు. బంగ్లాదేశ్‌లో హసన్ మహమూద్ 5 వికెట్లు తీశాడు. మెహదీ హసన్ మిరాజ్ ఒక వికెట్ తీశాడు.
Innings Break!
A mammoth 199 run partnership between @ashwinravi99 (113) & @imjadeja (86) steers #TeamIndia to a first innings total of 376.
Scorecard – https://t.co/jV4wK7BgV2… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/UWFcpoxN9U
— BCCI (@BCCI) September 20, 2024
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్: నజ్ముల్ హసన్ శాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, నహిద్ రాణా, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..