IND U19 vs PAK U19 Live: ఆసియా కప్‌లో హై ఓల్టేజీ మ్యాచ్‌కి రంగం సిద్ధం.. మరికొద్దిసేపట్లో మ్యాచ్ షురూ..!

India U19 vs Pakistan U19 Live Score in Telugu: అండర్-19 ఆసియా కప్ 2026 టోర్నీలో అసలు సిసలైన పోరుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. దాయాదుల సమరం కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒమన్ (Oman) లోని అల్ అమెరత్ వేదికగా భారత్ అండర్-19, పాకిస్తాన్ అండర్-19 జట్లు నేడు (ఆదివారం) అమీతుమీ తేల్చుకోనున్నాయి.

IND U19 vs PAK U19 Live: ఆసియా కప్‌లో హై ఓల్టేజీ మ్యాచ్‌కి రంగం సిద్ధం.. మరికొద్దిసేపట్లో మ్యాచ్ షురూ..!
Ind U19 Vs Pak U19 Live Socre Updates

Updated on: Nov 08, 2026 | 8:31 AM

India U19 vs Pakistan U19 Match 8 Live Updates in Telugu: అండర్-19 ఆసియా కప్ 2026 టోర్నీలో అసలు సిసలైన పోరుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. దాయాదుల సమరం కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒమన్ (Oman) లోని అల్ అమెరత్ వేదికగా భారత్ అండర్-19, పాకిస్తాన్ అండర్-19 జట్లు నేడు (ఆదివారం) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లో గెలుపొందిన ఇరు జట్లు.. గ్రూప్-Aలో టాప్ ప్లేస్ కోసం ఇప్పుడు సై అంటే సై అంటున్నాయి.

గతేడాది (2025) ఆసియా కప్ ఫైనల్లో పాక్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి బదులు తీర్చుకోవాలని యువ భారత్ రగిలిపోతుండగా.. మరోసారి టీమిండియాను దెబ్బకొట్టాలని పాకిస్తాన్ వ్యూహాలు రచిస్తోంది. మరి ఈ హైవోల్టేజ్ పోరులో పైచేయి ఎవరిది..? ప్రతీకారం తీర్చుకోవడంలో కుర్రాళ్లు సక్సెస్ అవుతారా..? మ్యాచ్‌కు సంబంధించిన బంతి బంతి అప్‌డేట్స్, లైవ్ స్కోర్ ఎప్పటికప్పుడు మీకోసం..!

Loading...
Unable to load recommendations.
Follow Us