IND vs SL: రోహిత్ సరసన మరో స్పెషల్ రికార్డు.. టీ20ల్లో తొలి భారతీయుడు, ఫీల్డర్‌గా నాలుగో స్థానం..

|

Feb 26, 2022 | 9:03 PM

Rohit Sharma: కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పటిలాగే మెరుగైన క్యాచర్‌గా నిరూపించుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా బంతికి పాతుమ్ నిశాంకను సులువుగా క్యాచ్ తీసుకున్నాడు.

IND vs SL: రోహిత్ సరసన మరో స్పెషల్ రికార్డు.. టీ20ల్లో తొలి భారతీయుడు, ఫీల్డర్‌గా నాలుగో స్థానం..
Rohit Sharma
Follow us on

భారత క్రికెట్(Team India) జట్టు గత కొన్ని వారాలుగా అద్భుత ప్రదర్శన చేస్తూ.. నిరంతర విజయాలను సాధిస్తోంది. రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలోని టీమిండియా ఫిబ్రవరి నెలలో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లలో వెస్టిండీస్‌ను సులభంగా ఓడించింది. ఆ తర్వాత శ్రీలంకతో టీ20 సిరీస్‌ విజయంతో ప్రారంభమైంది. ఇప్పటివరకు బాల్, బ్యాటింగ్‌తో టీమ్ ఇండియా ప్రదర్శనలో గణనీయమైన ఫలితాలు సాధిస్తోంది.

రోహిత్ శర్మ క్యాచ్‌ల రికార్డు..
భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పటిలాగే మెరుగైన క్యాచర్‌గా నిరూపించుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా బంతికి పాతుమ్ నిశాంకను సులువుగా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో అతని అంతర్జాతీయ టీ20లో 50 క్యాచ్‌లు కూడా పూర్తయ్యాయి. ఈ ఫార్మాట్‌లో 50 క్యాచ్‌లు పట్టిన తొలి భారతీయుడు, ప్రపంచంలో నాలుగో ఫీల్డర్‌గా నిలిచాడు. 44 క్యాచ్‌లు పట్టిన విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.

భారత టీం ముందు భారీ టార్గెట్..
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీం నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు సాధించింది. దీంతో టీమిండియా ఎదుట 184 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. టీంలో నిస్సాంక 75 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో షనక కేవలం 19 బంతుల్లో 47 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 5 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి.

Also Read: IND vs SL, 2nd T20, LIVE Cricket Score: తొలి వికెట్ కోల్పోయిన భారత్.. రోహిత్ ఔట్..

IND vs SL: కోహ్లీ స్పెషల్ మ్యాచ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం.. మండిపడుతోన్న ఫ్యాన్స్..