AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: బుమ్రా ఓ పిల్లబచ్చా.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొడతానన్నాడు.. కట్‌చేస్తే..

India vs Pakistan, Asia Cup 2025: పాకిస్తాన్ తరపున డాషింగ్ బ్యాట్స్‌మన్ అబ్దుల్లా షఫీక్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు సున్నా వద్దే ఔటయ్యాడు. కానీ అతను నాలుగు సార్లు కూడా గోల్డెన్ డక్ బాధితుడు కాలేదు.

IND vs PAK: బుమ్రా ఓ పిల్లబచ్చా.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొడతానన్నాడు.. కట్‌చేస్తే..
పాకిస్తాన్ తన రెండవ సూపర్ ఫోర్ మ్యాచ్‌ను శ్రీలంకతో ఆడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే, రెండు పాయింట్లు వస్తాయి. ఆ తరువాత బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే పాకిస్తాన్‌కు నాలుగు పాయింట్లు లభిస్తాయి. అయితే, ఈ సమీకరణం ప్రకారం బంగ్లాదేశ్ కూడా నాలుగు పాయింట్లు కలిగి ఉండవచ్చు.
Venkata Chari
|

Updated on: Sep 15, 2025 | 1:50 PM

Share

India vs Pakistan: ఆసియా కప్‌ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కు ముందు, మాజీ క్రికెటర్ పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ సైమ్ అయూబ్ గురించి కీలక ప్రకటన చేశాడు. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఆరు బంతుల్లో సైమ్ అయూబ్ ఆరు సిక్సర్లు కొట్టగలడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ పొగడ్తలతో హోరెత్తించాడు. అతనికి అలాంటి సామర్థ్యం ఉందంటూ చెప్పుకొచ్చాడు.

కానీ, భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో, హార్దిక్ పాండ్యా వేసిన తొలి బంతికే జస్‌ప్రీత్ బుమ్రాకు సులభమైన క్యాచ్ ఇచ్చి సైమ్ అయూబ్ ఔటయ్యాడు. కనీసం తన ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఈ విధంగా, సైమ్ అయూబ్ మొదటి బంతికే ఔటయ్యాడు. అంటే ఆసియా కప్ రెండో మ్యాచ్‌లో వరుసగా రెండోసారి గోల్డెన్ డక్‌గా అవుటయ్యాడు. అంతకుముందు, అయూబ్ ఓమన్‌పై తన ఖాతా తెరవలేకపోయాడు.

ఈ విధంగా, తన్వీర్ అహ్మద్ ఆరు సిక్సర్ల గురించి మాట్లాడుతుంటే ఆసియా కప్‌లో గత రెండు మ్యాచ్‌లలో ఒక్క పరుగు కూడా సాధించలేకపోయాడు ఈ పాక్ ప్లేయర్. దీంతో పాకిస్తాన్‌కు మంచి ఆరంభం లభించడం లేదు.

ఇవి కూడా చదవండి

సైమ్ అయూబ్ గురించి చెప్పాలంటే, అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు గోల్డెన్ డక్ బాధితుడిగా మారిన పాకిస్తాన్ తరపున రెండవ బ్యాట్స్‌మన్ అయ్యాడు.

పాకిస్తాన్ తరపున డాషింగ్ బ్యాట్స్‌మన్ అబ్దుల్లా షఫీక్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు సున్నా వద్దే ఔటయ్యాడు. కానీ అతను నాలుగు సార్లు కూడా గోల్డెన్ డక్ బాధితుడు కాలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మధుమేహం నియంత్రణలో ఉండాలంటే మీ టిఫిన్లో ఇది ఉండాల్సిందే!
మధుమేహం నియంత్రణలో ఉండాలంటే మీ టిఫిన్లో ఇది ఉండాల్సిందే!
తిన్న తర్వాత కడుపులో గడబిడా.. మీరు చేస్తున్న తప్పు ఇదే
తిన్న తర్వాత కడుపులో గడబిడా.. మీరు చేస్తున్న తప్పు ఇదే
గురు మంగళ యోగం ఎఫెక్ట్.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదట! మీ రాశి
గురు మంగళ యోగం ఎఫెక్ట్.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదట! మీ రాశి
బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డా, అవకాడోనా? మీ ఆరోగ్యాన్ని కాపాడేది ఇదే..
బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డా, అవకాడోనా? మీ ఆరోగ్యాన్ని కాపాడేది ఇదే..
IND vs AFG: ఆఫ్ఘాన్‌తో చివరి మ్యాచ్.. ఆ ముగ్గురు ఔట్..?
IND vs AFG: ఆఫ్ఘాన్‌తో చివరి మ్యాచ్.. ఆ ముగ్గురు ఔట్..?
ఆవు నెయ్యి vs గేదె నెయ్యి.. ఏది తింటే ఆరోగ్యానికి మేలు?
ఆవు నెయ్యి vs గేదె నెయ్యి.. ఏది తింటే ఆరోగ్యానికి మేలు?
వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు పిల్లలు మృతి
వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు పిల్లలు మృతి
జర్మన్ సిల్వర్ అని ఎందుకు అంటారు? పేరు వెనుక అసలు కథ ఇదే!
జర్మన్ సిల్వర్ అని ఎందుకు అంటారు? పేరు వెనుక అసలు కథ ఇదే!
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!
ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!